కరీంనగర్లో బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడంపై పోలీసులు.. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఆదివారం రోజున చికెన్, మటన్ విక్రయ కేంద్రాల్లో రద్దీపై దృష్టిసారించారు. తనిఖీల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు.
ప్రధానంగా నగరంలో అతి రద్దీగా ఉండే 13 ప్రాంతాలను గుర్తించిన సీపీ కమలాసన్‌రెడ్డి.. రద్దీ సమాచారం వెనువెంటనే హెడ్‌క్వార్టర్‌కు చేరే విధంగా చర్యలు తీసుకున్నారు. డీసీపీ చంద్రమోహన్‌తో పాటు ఏసీపీ అశోక్‌కుమార్ ఆయా మార్కెట్‌లలో పర్యటించారు. ప్రజలు భౌతిక దూరం పాటిస్తున్నారా.. మాస్కులు ధరిస్తున్నారా అని పరిశీలించారు. నిబంధనలు పాటించనివారికి అవగాహన కల్పిస్తున్నారు.
ఇవీచూడండి: ఆంక్షలు ఫలించిన వేళ.. సడలింపులకు సమాయత్తం