ETV Bharat / city

Huzurabad by poll 2021: ప్రచార పర్వంలో ఈటల దంపతులు వర్సెస్ తెరాస మంత్రులు

హుజూరాబాద్ ఉపఎన్నికలో ప్రధాన పార్టీల మధ్య (Huzurabad by poll 2021) పోటీ నెలకొంది. ప్రధానంగా చూస్తే రెండు పార్టీల మధ్యే అసలైన సమరం జరగనున్నట్లు తెలుస్తోంది. అధికార తెరాస, భాజపా మధ్యే నువ్వా-నేనా అన్నట్టుగా పోటీ ఉంది. తెరాస వైపు మంత్రులు, భాజపా తరఫున ఈటల దంపతులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు.

Huzurabad by poll 2021
హుజూరాబాద్ ఉపఎన్నిక
author img

By

Published : Oct 18, 2021, 8:05 AM IST

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీల ప్రచారం (Huzurabad by poll 2021) వినూత్నంగా సాగుతోంది. త్రిముఖపోటీ ఉన్నా రెండు పార్టీల మధ్యే నువ్వా-నేనా అన్నట్టుగా సాగుతోంది. తెరాస, భాజపా (TRS vs BJP) మధ్య ప్రచారం రసవత్తరంగా ఉంది. ప్రధాన పార్టీలు ఒక్కొక్కరు 20 మంది చొప్పున ప్రచార తారల పేర్లను ఎన్నికల సంఘానికి ఇచ్చినప్పటికి భాజపా నుంచి ఈటల దంపతులు.. తెరాస నుంచి హరీశ్​రావు, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌ ప్రచారాన్ని తమ భుజస్కంధాలపై వేసుకొని కొనసాగిస్తున్నారు.

హుజూరాబాద్​లోనే మకాం...

ఈటల రాజేందర్‌(Etela Rajender)ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేసిన ఎపిసోడ్ తరువాత నుంచి ఇప్పటివరకు తెరాస పట్టుకోసం చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావనే చెప్పాలి. మంత్రులు తన్నీరు హరీశ్​రావు (Minister Harish Rao), గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌ హుజూరాబాద్ కేంద్రంగానే రాజకీయ సమీకరణాలు జరుపుతూ వస్తున్నారు. ఇప్పటికే స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హుజూరాబాద్‌లో పర్యటించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి మంత్రులు హరీశ్​, గంగుల, కొప్పుల తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు.

గెలుపే లక్ష్యంగా...

ఆత్మీయ సమ్మేళనాలు, మహిళా సంఘాల సమావేశాలతో గెలుపు సునాయాసం చేసే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలుపే లక్ష్యంగా (Huzurabad by poll 2021) సామాజిక వర్గాల సమీకరణాలు జరుపుతూనే ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ప్రచార సభలు, ఓటు బ్యాంకు ఉన్న వారిని అధికార పార్టీకి అనుకూలంగా మల్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఓటర్లను ప్రభావితం చేసే ఏ అంశాన్ని వదలకుండా పావులు కదుపుతున్నారు. 2004 నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఈటల కోటకు బీటలు తేవడమే లక్ష్యంగా మంత్రులు ముందుకు సాగుతున్నారు.

ఈటల దంపతుల స్టైల్ ఇది..

రాష్ట్రంలో అధికార తెరాసను ఎదిరించి ఉపఎన్నికల బరిలో నిల్చిన ఈటల రాజేందర్.. నియోజకవర్గంలో అన్నీ తానై పని చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఓ వైపున ఈటల, మరో వైపున ఆయన సతీమణి జమున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉద్యమంలో ఈటల పాత్రతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి అందించిన తోడ్పాటు గ్రామాల్లో తిరుగుతూ తనను గెలిపించాలని ఓట్లు అభ్యర్థిస్తున్నారు. నోటిఫికేషన్ విడుదల అయిన తరువాత అయితే ఈటల దంపతులు కార్యక్షేత్రంలోనే ఉంటూ తమ ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు.

అండగా ఉన్న వాళ్లు వీడినా...

అండగా ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులంతా వీడినా.. ఈటల రాజేందర్ మాత్రం వెనుకంజ వేయడం లేదు. పక్కా ప్రణాళికతో రాజేందర్ కొన్ని గ్రామాల్లో పర్యటిస్తే ఆయన భార్య జమున మరికొన్ని గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. దేవాదాయ భూములు కబ్జా చేశారన్న ఆరోపణలను స్వయంగా ఖండించిన ఈటల జమున ప్రచారంలోనూ తన హవా కొనసాగిస్తున్నారు. అధికార తెరాస ప్రచార తారలతో హంగామా కొనసాగిస్తున్నా.. ఈటల దంపతులు మాత్రం తన పదునైన పంచులు ... ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టార్గెట్‌ చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని (Huzurabad by poll 2021) మరింత హీటెక్కిస్తున్నారు.

ఇదీ చూడండి: Huzurabad by election campaign: ప్రచారానికి పది రోజులే గడువు.. హోరెత్తుతున్న పార్టీల జోరు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.