ETV Bharat / city

health conscious: కొవిడ్‌ విజృంభణతో ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధ - తెలంగాణ వార్తలు

కరోనా విజృంభణ(covid)తో ప్రతిఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ(health conscious) పెడుతున్నారు. వ్యాధి నిరోధక శక్తి(immunity power)ని పెంచుకోవడంపై దృష్టిసారిస్తున్నారు. ఈ క్రమంలో ఆహార అలవాట్ల(food habits)లో మార్పులు చేసుకున్నారు. పండ్లు, డ్రైఫూట్స్‌కు ప్రాధాన్యం ఇవ్వడంతో వాటి కొనుగోళ్లు పెరిగిపోయాయి. ఈ దుకాణాలు వినియోగదారులతో సందడిగా మారుతున్నాయి.

health conscious
పండ్లకు గిరాకీ
author img

By

Published : May 29, 2021, 4:18 AM IST

కొవిడ్‌ విజృంభణతో ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధ

ఇన్నాళ్లూ ఉదయం లేస్తే టిఫిన్‌, మధ్యాహ్నాం అన్నం.. రాత్రి అన్నం లేదంటే హోటల్‌ భోజనాలు చేసే ప్రజల్లో చాల మార్పే వచ్చింది. రెండు నెలలుగా కరోనా విజృంభణతో.. ఆహారపు అలవాట్ల(food habits)ను మార్చుకుంటున్నారు. రోగ నిరోధక శక్తి (immunity power)ని పెంచే ఆహారాలను వినియోగిస్తున్నారు. పండ్ల గిరాకీ గత కొన్ని నెలల నుంచి బాగా పెరిగిపోయింది. బొప్పాయి, యాపిల్‌, దానిమ్మ, ద్రాక్ష, డ్రాగన్‌ ఫ్రూట్‌, అరటి, కర్బూజ, బత్తాయి తదితర పండ్ల వినియోగం పెరిగిపోయింది. జగిత్యాల జిల్లాను చూస్తే జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల డివిజన్ల పరిధిలో రోజూ 20 లక్షల మేర వ్యాపారం జరిగేది. ఇప్పుడు ఇది 30 నుంచి 35 లక్షలకు వ్యాపారం చేరుకున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఈ రెండు నెలలుగా పండ్ల వినియోగం బాగ పెరిగిపోయిందని ధరలు పెరినా కొనుగోళ్లు చేస్తున్నామని వినియోగదారులు చెబుతున్నారు.

పండ్లతోపాటు డ్రై ప్రూట్స్‌ జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఖజ్జురా, అంజీర, వాల్‌నట్స్‌, పిస్తా, గుమ్మడి గింజలు ఇలా పలు రకాల డ్రై ప్రూట్స్‌ భారీగా అమ్మకాలు పెరిగిపోయాయి. డ్రై ప్రూట్స్‌(dry fruits) జగిత్యాల జిల్లాలో ప్రతి రోజు 10 లక్షల మేరా వ్యాపారం జరుగుతందని అంచనా. సగటున ఒక్కో కుటుంబం వెయ్యి నుంచి రెండు వేల వరకు పండ్లు, డ్రై ప్రూట్స్‌కు, ఇతర పౌష్టికాహారానికి ఖర్చు చేస్తున్నారు. కరోనా మహ్మరి కారణంగా ఆహారపు అలవాట్లలో మార్పు వచ్చినట్లు చెప్పుతున్నారు.. లాక్​డౌన్‌(lockdown) సమయంలోనూ భారీగానే కొనుగోళ్లు సాగుతున్నట్లు వ్యాపారులు చెప్పుతున్నారు. లాక్​డౌన్‌ లేక పోతే మరింత వ్యాపారం పెరిగేదని వ్యాపారులు పేర్కొంటున్నారు.

ఇవీ చూడండి: పేదల కోసం ఉచిత మార్కెట్​.. ఎక్కడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.