gurukula students suffer with food poisoning: కరీంనగర్ జిల్లా చొప్పదండి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 70 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం భోజనం తర్వాత కొంత మంది బాలికలు కడుపునొప్పి, వాంతులతో బాధపడుతున్నట్లు ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేశారు. వాళ్లకు ప్రాథమిక చికిత్స అందించే సమయంలోనే.. ఇంకొంత మంది కళ్లు తిరుగుతున్నాయని.. మరికొందరు వాంతులవుతున్నట్టు ఉపాధ్యాయులకు తెలిపారు.
food poison in gurukula school: అప్రమత్తమైన ఉపాధ్యాయులు అందరినీ అంబులెన్స్‌లో చొప్పదండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ సిబ్బంది లేకపోవడంతో.. హుటాహుటిన కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విద్యార్దులంతా 5, 6, 7 తరగతులకు చెందినవారు. అస్వస్థతకు గురైన తోటి విద్యార్థులను చూసి.. ఆందోళన చెందిన మరికొంత మంది కళ్లు తిరిగి పడిపోయారు.
తిన్న కాపేపటికే...
"మధ్యాహ్నం భోజనం చేశాను. కాసేపటికే కడుపునొప్పి రావటం వల్ల.. టీచర్‌కు చెప్పాను. అలా చెప్పుకుంటూనే కళ్లు తిరిగి పడిపోయాను." - మహన్విత,విద్యార్థిని
మేము కూడా అదే భోజనం తిన్నాం..
"మధ్యాహ్న భోజనం చేశాక అర్ధగంట వరకు అందరు బాగానే ఉన్నారు. ఆ తర్వాతే ఒకమ్మాయి కడుపునొప్పి వస్తుందంటూ వచ్చింది. ఆమెను పరిశీలించే సమయంలోనే.. ఒకరి తర్వాత ఒకరు కళ్లు తిరుగుతున్నాయని, కడుపు నొప్పితో వచ్చారు. వెంటనే అంబులెన్స్‌లో చొప్పదండి ఆస్పత్రికి తీసుకొచ్చాం. అక్కడ ఎవరూ లేకపోవటం వల్ల నేరుగా కరీంనగర్ ఆస్పత్రికి తీసుకొచ్చాం. ఇప్పుడు అందరూ బాగానే ఉన్నారు. పిల్లలతో పాటు మేము కూడా అదే భోజనం తిన్నాం. ప్రిన్స్‌పల్ కూడా ఇదే భోజనం తింటారు. భోజనంలోనైతే.. ఎలాంటి కల్తీ ఉండదు." -స్పందన,హెల్త్ సూపర్‌వైజర్, చొప్పదండి గురుకుల పాఠశాల
బాధిత విద్యార్థినులందరికీ కరీంనగర్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. ప్రస్తుతం అందరి పరిస్థితి బాగానే ఉన్నట్టు చెబుతున్నారు. ఆహారం వికటించటం వల్లే విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్టు చెబుతున్నారు. ఆహారం కలుషితం కావటంపై తహసీల్దార్ విచారణ జరుపుతున్నారు.
ఇదీ చూడండి: