ETV Bharat / city

Huzurabad congress candidate Venkat : వెంకట్​ ఆస్తులెంత? అతనిపై ఉన్న కేసులెన్నో తెలుసా?

హుజూరాబాద్​ కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్​(Huzurabad congress candidate Venkat) ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మరో కాంగ్రెస్ నేత దామోదర్ రాజనర్సింహ పాల్గొననున్నారు. తనపై మొత్తం 24 కేసులున్నట్లు బల్మూరి వెంకట్(Huzurabad congress candidate Venkat)​ అఫిడవిట్​లో వెల్లడించారు.

Huzurabad congress candidate Venkat
Huzurabad congress candidate Venkat
author img

By

Published : Oct 8, 2021, 9:42 AM IST

హుజూరాబాద్​ ఉపఎన్నిక నామినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్(Huzurabad congress candidate Venkat) నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో వెంకట్ వెంట.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, దామోదర రాజనర్సింహ ఉండనున్నారు. ఆయన తరఫున కొల్లూరి కిరణ్ గురువారం రోజున హుజూరాబాద్​ ఆర్డీవో కార్యాలయంలో ఒక సెట్ నామపత్రాలు సమర్పించారు.

కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరిపై 24 కేసులు..

కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ (వెంకటనర్సింగరావు(Huzurabad congress candidate Venkat))పై మొత్తం 24 కేసులున్నాయి. ఈ మేరకు ఆయన అఫిడవిట్‌లో వెల్లడించారు. ఆయన తరఫున కొల్లూరి కిరణ్‌ గురువారం హుజూరాబాద్‌ ఆర్డీవో కార్యాలయంలో ఒక సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. వెంకట్‌తోపాటు ఆయన తల్లి పద్మ ఆస్తిపాస్తుల వివరాల్ని ప్రమాణ పత్రంలో పేర్కొన్నారు. తల్లి మెడికల్‌, ఫార్మసీ వ్యాపారం నిర్వహిస్తున్నారని, తాను ఫిట్‌నెస్‌ జిమ్‌ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు, ఆందోళనలు, ధర్నాల సందర్భంగా మొత్తం 24 కేసులు వివిధ ఠాణాల్లో నమోదయ్యాయని తెలిపారు.

వెంకట్‌ ఆస్తులు.. నగదు: రూ.48,525

  • వాహనం: రూ.14.50 లక్షల విలువ చేసే టాటా సఫారీ స్ట్రోమ్‌
  • బంగారం: రూ.22.19 లక్షల విలువైన 46 తులాలు
  • మొత్తం చరాస్తుల విలువ: రూ.44.51 లక్షలు
  • వ్యవసాయ భూములు: 4ఎకరాల 31 గుంటలు

తల్లి పద్మ ఆస్తులు.. నగదు: రూ.95,300

  • బంగారం: రూ.14.81 లక్షల విలువైన 30 తులాలు
  • మొత్తం చరాస్తుల విలువ: రూ.28.93 లక్షలు
  • వ్యవసాయ భూములు: 19 ఎకరాల 21 గుంటలు
  • అపార్ట్‌మెంట్‌, స్థలాల విలువ: రూ. 1.39 కోట్లు

ఎలాంటి రాజకీయ కుటుంబ నేపథ్యం లేకున్నా.. కష్టపడే తత్వాన్ని గుర్తించి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించడం కాంగ్రెస్‌లోనే సాధ్యమని వెంకట్(Huzurabad congress candidate Venkat) అన్నారు. హుజూరాబాద్‌లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.