ETV Bharat / city

ఆశల ఊసులు.. కేటా‘యింపు’పై ఉత్కంఠ - కేంద్ర బడ్జెట్​ 2021

ఎన్నో ఆశలతో.. మరెన్నో అంచనాలతో కేంద్ర పద్దు మరోసారి మన ముంగిట్లోకి రానుంది. కరోనా మహమ్మారి సృష్టించిన విపత్తు నుంచి ఇప్పుడిప్పుడే అన్ని రంగాలు తేరుకుంటుండటం, వ్యవస్థ గాడిలో పడేలా ప్రగతి ప్రయాణం కనిపిస్తుండటంతో నేడు కేంద్ర సర్కారు ప్రవేశపెట్టనున్న పెద్ద పద్దుపైనే అందరి దృష్టి మళ్లింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు దక్కాల్సిన ప్రయోజనాలు, రైలు మార్గాలకు నిధుల కేటాయింపు.. అన్నింటికి మించి వేతన జీవులకు మేలు చేసే నిర్ణయాల ప్రకటనలపై ఉత్కంఠ నెలకొంది.

NIRMALA
NIRMALA
author img

By

Published : Feb 1, 2021, 7:00 AM IST

ఉత్తర తెలంగాణలోనే కీలకమైన ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఏళ్లతరబడి రహదారుల విస్తరణ ప్రక్రియనే పెనుసమస్యగా మారింది. 2014లో జాతీయ రహదారులుగా ఏర్పాటైన పలుమార్గాలకు మోక్షం లభించేలా పూర్తిస్థాయి నిధులు ఇన్నాళ్లుగా అందలేదు. ముఖ్యంగా వరంగల్‌-కరీంనగర్‌-జగిత్యాల మార్గానికి ఈ ఏడాది ఎంతలేదన్నా రూ.500కోట్ల నిధులు కేటాయించాల్సిన అవసరం అత్యధికంగా ఉంది. ఇదే సమయంలో కరీంనగర్‌- సిరిసిల్ల- పిట్లం, సిరిసిల్ల- సిద్దిపేట-జనగాం, జగిత్యాల- మెట్‌పల్లి- నిజామాబాద్‌, నిర్మల్‌- ఖానాపూర్‌- జగిత్యాల, కరీంనగర్‌- మానకొండూర్‌- వీణవంక-భూపాలపల్లి, రాయపట్నం- కరీంనగర్‌- కోదాడ మార్గాల ప్రకటన తప్పా.. వాటి అడుగులు ముందుకుపడేలా నిధుల మాటే ఇన్నాళ్లుగా వినిపిస్తలేదు. ఈ బడ్జెట్‌లోనైనా వీటి ప్రస్తావన ఉంటే ప్రయాణ సౌలభ్యం నాలుగు జిల్లాలతోపాటు సరిహద్దు జిల్లాలకు మరింతగా పెరగనుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సమారుగా 2వేల కి.మీ దారులు మెరుగుపడేలా ప్రధానమంత్రి గ్రామీణ్‌ సడక్‌ యోజన నిధుల పరంగా కరుణ ఉండాలి.

పరి‘శ్రమ’ పెరిగేలా..

పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి దిశగా అడుగులు పడటంతోపాటు ఈసారి అక్కడి అభివృద్ధి పనులకు తగిన నిధులు నేటి బడ్జెట్‌లో కేటాయించే వీలుంది. ఇదే కాకుండా ఆహారోత్పత్తులు, ఇతర పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చేలా ప్రకటనలలు, రాయితీ, రుణ వర్గాలుండాలనే ఆశను ఔత్సాహికులతోపాటు ఉపాధి కోసం ఉబలాటపడుతున్న యువత చూపుతున్నారు. ఇక అంకుర పరిశ్రమలతోపాటు మేకిన్‌ ఇండియా బలోపేతం చేసే దిశగా జిల్లాను తాకేలా కేటాయింపు జోరు కనిపించాలి. నైపుణ్యాభివృద్ధి పెరిగేలా తోడ్పాటు పలురకాలుగా పెరగాలి. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతోపాటు కార్మికులకు మేలు చేసేలా.. వారి శ్రమశక్తి పెరిగేలా ప్రకటనుండాలి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పెద్దఎత్తున ఉన్న కార్మిక వర్గానికి న్యాయం చేసేలా నిర్ణయాలు వెలువడాలి. 4లక్షలమంది ఉపాధి కూలీలు జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వరంగా మార్చుకుని దినసరి వేతనాన్ని అందుకుంటున్నారు. ఈ ఏడాది వ్యవసాయానుబంధంగా పనుల కల్పనతోపాటు వీలైనన్ని ఎక్కువ పనులు అందించేలా నిధులు విడుదల చేసేలా బడ్జెట్‌లో పెద్దపీట కనిపించాలి. వ్యవసాయాధారిత జిల్లాగా.. పేరొందిన నాలుగు జిల్లాలోని 6 లక్షల మంది రైతులకు సంబంధించి కేంద్రం పథకాల పంథాను మరింత ఉపయుక్తంగా మార్చాలి. పసల్‌బీమా వర్తింపజేసేలా భారీగా నిధులు కేటాయించడంతోపాటు పండించిన పంటలకు మేలు చేసేలా నిర్ణయాలు కనబడాలి.

పథకాలకు నిధులిస్తేనే..

కరీంనగర్‌, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలో గత నెలలో దిశ(జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్‌ కమిటీ) సమావేశాలను పార్లమెంట్‌ సభ్యులు నిర్వహించి కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రగతిపై ఆరా తీశారు. జిల్లాలో అమలవుతున్న సుమారు 40 కేంద్రపథకాలకు సంబంధించిన ప్రగతి కోసం నిధులు ఎక్కువగా అందాల్సిన ఆవశ్యకత కనిపించింది. నేషనల్‌ హెల్త్‌మిషన్‌, నేషనల్‌ రూరల్‌ లైవ్‌హుడ్‌ మిషన్‌, రూర్బన్‌ పథకం, రాష్ట్రీయ క్రిషి వికాస్‌ యోజన, సుగమ్య భారత్‌ అభియాన్‌, బేటి బచావో- బేటీ పడావో, ఆదర్శ్‌గ్రామ్‌ యోజన, ఈ-నేషనల్‌ అగ్రికల్చరల్‌ మార్కెట్‌(ఈ-నామ్‌), స్వచ్ఛభారత్‌ మిషన్‌, ప్రధానమంత్రి సడక్‌ యోజన, దీన్‌దయాల్‌ గ్రామీణ విద్యుద్దీకరణ యోజనలాంటి పథకాలకు నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని పథకాల ప్రగతి ముందడుగు వేయాలంటే కాసుల కరుణ కురిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇలా ఆకాంక్షలెన్నో..!

  • పల్లెలకు సాంకేతిక చేరువయ్యేలా ఈ డిజిటల్‌ అక్షరాస్యత, ఉచిత వైఫై దిశగా గతంలో వినిపించిన మాటలకు అదనంగా నిధులు విడుదల ప్రస్తావన ఉండాలి.
  • యువతకు ఉపాధి కల్పన విషయంలో గతంలో అమలైన శిక్షణ కార్యక్రమాల పునరుద్ధరణకు తోడ్పాటు పెరగాలి. ప్రధానమంత్రి కౌషల్‌ కేంద్రాలు బలోపేతమవ్వాలి.
  • పాడి ఆధారిత పరిశ్రమల వృద్ధికి ఆత్మనిర్బర్‌లో తోడ్పాటు పూర్తిస్థాయిలో అందలేదు. ఈ నిధులు జిల్లాల వరకు అందేలా కేటాయింపుల జోరు ఈసారి ఉండాలి.
  • నాబార్డుకు అధికంగా కేటాయింపులుంటేనే జిల్లాలో అమలవుతున్న వాటర్‌షెడ్‌ , సేంద్రియ సాగుకు ఊతమనేలా అన్నదాతల్లో ఆనందం కనిపించే వీలుంది.
  • ఆకర్షణీయ నగరాల జాబితాలో ఉన్న కరీంనగర్‌ కార్పొరేషన్‌కు నిధుల విడుదల పరంపర అభివృద్ధి కార్యక్రమాల అమలు కోసం అందాల్సిన అవసరముంది.
  • ఆరోగ్య రక్షణను పెంచేలా మరింత భద్రత పెరగాలి. రాష్ట్రంలో ఆయు ష్మాన్‌భారత్‌ అమలు నిర్ణయంతో జిల్లాకు చేరే ప్రయోజనాలపై అందరిలో ఆశ పెరిగింది.
  • గతంలో కరీంనగర్‌కు కేటాయించాలనుకున్న ట్రిపుల్‌ఐటీ, మెడికల్‌ కళాశాల విషయంలో కొత్తగా మరోసారి ఆశాజనకమైన ప్రకటన వినిపించాల్సిన అవసరముంది.
  • పసుపు రైతులకు మేలు చేసే బోర్డు ఏర్పాటు సహా ఇతర ప్రోత్సాహకాలు, జిల్లాకు చెందిన రైతులు ఎదురుచూస్తున్నారు.

ఇదీ చదవండి : నేటి నుంచి సినిమా థియేటర్లలో పూర్తిస్థాయి ప్రేక్షకులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.