ETV Bharat / city

మూవీ కోసం థియేటర్​కి వెళ్లారు... ఆసుపత్రికి పరుగులు తీశారు - తేనెటీగల దాడి

Honey Bees Attack on Audience: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ఓ థియేటర్‌లో ప్రేక్షకులపై తేనెటీగలు దాడి చేయడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనలో దాదాపు ఇరవై మందికి పైగా గాయాలు కాగా.. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్సకు కరీంనగర్‌ ఆసుపత్రికి తరలించారు.

Honey Bees Attack
Honey Bees Attack
author img

By

Published : Apr 14, 2022, 4:07 PM IST

Honey Bees Attack on Audience: థియేటర్​లో సినిమా చూడడానికి వెళ్లిన ప్రేక్షకులపై తేనెటీగలు దాడి చేయడం కలకలం రేపింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో చోటుచేసుకుంది. అక్కన్నపేట రోడ్డులో ఉన్న వెంకటేశ్వర ఏసీ థియేటర్‌లో కేజీఎఫ్​-2 సినిమా చూడటానికి వచ్చిన వారు టికెట్లు తీసుకుంటుండగా ఆకస్మాత్తుగా తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో దాదాపు ఇరవై మందికి పైగా గాయాలు కాగా.... వారిని హుస్నాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో... మెరుగైన చికిత్సకు కరీంనగర్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ఇదీ చదవండి:అతడి అదృష్టం అడ్డం తిరిగింది.. గొంతులో యాట బొక్క ఇరుక్కుని..!!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.