కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలోని గన్నేరువరం, శంకరపట్నం, తిమ్మాపూర్, మానకొండూరు మండలాల్లో భారీ వర్షం కురిసింది. అకాల వర్షం వల్ల చేతికొచ్చిన పంట నీటి పాలయింది. చెమటోడ్చి పండించిన పంటకు తెగుళ్లు సోకి సగం నాశనమై.. నష్టం మిగిలిస్తే.. కష్టపడి కాపాడుకుని.. కోసి కుప్పలు చేసిన పంట.. విక్రయించే సమయానికి అకాల వర్షం కారణంగా పూర్తిగా తడిసి ముద్దయిందని రైతులు భోరున విలపించారు. కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం సైతం తడిసి ముద్దయి నష్టాన్ని మిగిల్చింది. వర్షంలో తడిసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు కుటుంబ సమేతంగా కష్టపడ్డా.. ఫలితం లేకుండా పోయింది. టార్పాలిన్ కవర్లు అందుబాటులో లేకపోవడం వల్ల ధాన్యం పూర్తిగా తడిసిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: 'అనుమానాల్లేవ్... కరోనాపై విజయం తథ్యం'