FARMERS PROBLEMS PADDY: కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం గోదాములకు చేరే వరకు... రైతులు నానాతంటాలు పడుతున్నారు. వడ్ల కొనుగోలు ప్రక్రియ పూర్తి అయ్యిందంటే... రైతు పాత్ర అంతటితో ముగిసిపోతుందని గోదాములకు తరలించే బాధ్యత మిల్లర్లపై పడుతుంది. అయితే సాధ్యమైనంత మేర కొనుగోళ్లలో తాత్సారం చేస్తే... ధాన్యం కుప్పల వద్ద రైతులు అందుబాటులో ఉంటారనే అభిప్రాయంతో కొనుగోళ్లలో ఆలస్యం చేస్తున్నారు. ఒకవైపు కొనుగోళ్లు ఆలస్యమౌతుంటే మరోవైపు అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోళ్లలో ఆలస్యం జరిగినప్పుడు కనీసం టార్పాలిన్లు సరఫరా చేసినా బాగుండేదని... కరీంనగర్ జిల్లాకు చెందిన అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొనుగోలు కేంద్రాల నుంచి రైస్‌మిల్లులకు ధాన్యం బస్తాలు చేరవేయడంలోనూ... జాప్యం జరుగుతోంది. రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం ట్రాక్టర్లు, లారీ యజమానులపై ఒత్తిడి తీసుకొచ్చి బస్తాలను తరలిస్తుండగా... అన్‌లోడింగ్‌లో జాప్యం జరగడం పట్ల డ్రైవర్లు, యజమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. గోదాముల వద్ద హమాలీలు అందుబాటులో లేరని వేర్వేరు కారణాలతో రోజుల తరబడి ధాన్యం బస్తాలతో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోందంటున్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఉన్న లోటుపాట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తే... సమస్యలు పరిష్కారం అవుతాయని రైతులు, డ్రైవర్లు సూచిస్తున్నారు.
"ప్రభుత్వం టార్పాలిన్లు అందుబాటులో లేవు. బయటి నుంచి కిరాయికి తెచ్చుకుంటున్నాం. పీఎసీఎస్‌లో టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలి. గత ప్రభుత్వంలో సబ్సీడీ మీద టార్పాలిన్లు ఇచ్చేవారు. వీటికే డబ్బులు అయిపోతున్నాయి." -రైతులు
"గోదాముల వద్ద హమాలీలు అందుబాటులో లేరు. వేర్వేరు కారణాలతో రోజుల తరబడి ధాన్యం బస్తాలతో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాకు వచ్చే కిరాయి 1700 రూపాయలు. నాలుగు రోజుల నుంచి వేచి ఉన్నాం.రోజుల తరబడి వేచిఉండటంతో టైర్లు పాడవుతున్నాయి. మిల్లర్లు, ప్రభుత్వం వెయిటింగ్ ఛార్జీలు ఇప్పించాలి." - ట్రాక్టర్ డ్రైవర్లు
ఇవీ చదవండి: మట్టికి విలువిస్తేనే మనిషికి విలువ పెరుగుతుంది: ఎంపీ సంతోశ్‌కుమార్
సరికొత్త స్టైల్లో పెళ్లి మండపానికి వధువు.. వరుడు షాక్.. వీడియో వైరల్!