మద్యం దుకాణాల ఎంపిక ప్రక్రియను రేపు కలెక్టర్ల నేతృత్వంలో లాటరీ ద్వారా ఎంపిక చేయనున్నారు. రాష్ట్రంలో మద్యం దుకాణాల కోసం లిక్కర్ వ్యాపారులు భారీగా పోటీ పడ్డారు. రాష్ట్రవ్వాప్తంగా 2,216 మద్యం దుకాణాల కోసం 48,401 దరఖాస్తులు వచ్చాయి. కేవలం దరఖాస్తు రుసుముల ద్వారానే ప్రభుత్వానికి రూ.968.02కోట్ల ఆదాయం వచ్చినట్లు అబ్కారీ కమిషనర్ రవిప్రకాశ్ తెలిపారు.
అత్యధిక దరఖాస్తులు ఇక్కడి నుంచే...
మద్యం దుకాణాల కోసం అత్యధికంగా రంగారెడ్డి ఎక్సైజ్ డివిజన్ నుంచి 8,892 దరఖాస్తులు వచ్చినట్లు అబ్కారీ కమిషనర్ తెలిపారు. వరంగల్ ఎక్సైజ్ డివిజన్ నుంచి 8,101 దరఖాస్తులు వచ్చి రెండో స్థానంలో నిలిచింది. రేపటి మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు.