కరోనా మహమ్మారి ప్రభావం రాఖీపౌర్ణమిపై పడింది. సోదర సోదరీమణులకు అనుబంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ నేపథ్యంలో... కరీంనగర్ టవర్ సర్కిల్ వారం రోజుల ముందు నుంచి కొనుగోలుదారులతో కిటకిట లాడేది. ప్రస్తుత పరిస్థితులతో వ్యాపార సముదాయాలు వెలవెలబోతున్నాయి.
రాఖీలను ఖరీదు చేసేందుకు మహిళలు సైతం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఈ క్రమంలో రాఖీల వ్యాపారంపై ఆధారపడ్డ సీజనల్ వ్యాపారస్థులు లబోదిబోమంటున్నారు. గతంలో మిగిలిపోయిన స్టాక్‌తో పాటు ఈ ఏడాది కొత్తగా కొనుగోలు చేసిన రాఖీలు అమ్ముడు పోయే పరిస్థితి కనబడడం లేదని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.