రాష్ట్రానికి అత్యవసరంగా 30 లక్షల డోసులు అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5.66 లక్షల డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
నిత్యం లక్షకుపైగా టీకాలు వేస్తున్నామని.. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిల్వలు కేవలం మూడు రోజులకు మాత్రమే సరిపోతాయని లేఖలో సీఎస్ వివరించారు. కరోనా కట్టడికి అత్యవసరంగా టీకాలను పంపించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: సోనూ సాయం.. విద్యార్థుల కోసం సెల్ టవర్ ఏర్పాటు