Harish Rao on Chakali Ailamma: చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని అందిపుచ్చుకొని తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసుకున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. నేడు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు సర్కిల్ వద్ద ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రి నివాళులు అర్పించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని హరీశ్‌రావు కొనియాడారు. చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నిర్ణయించారని పేర్కొన్నారు. ఐలమ్మ వేడుకలను అధికారికంగా నిర్వహించడం మనందరికీ గర్వకారణమని.. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జయంతి వేడుకలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో ఐలమ్మ నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని సిద్ధిపేట పట్టణంలో ఏర్పాటు చేస్తామన్నారు.
సిద్దిపేటలో అన్ని సౌకర్యాలతో మోడరన్ దోబీ ఘాట్లను రజకుల సౌకర్యార్థం నిర్మించనున్నామన్నారు. రానున్న రోజుల్లో ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా రజకులకు పెద్ద ఎత్తున రుణాలు, స్వయం ఉపాధి యూనిట్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు.
తెరాస పార్టీలో చేరికలు.. మరోవైపు మంత్రి హరీశ్‌రావు సమక్షంలో పలువురు యువకులు తెరాసలో చేరారు. వీరికి మంత్రి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. భాజపా, కాంగ్రెస్‌కు చెందిన 50 మంది కార్యకర్తలు సైతం తెరాసలో చేరారు. ఈ సందర్భంగా భాజపా, కాంగ్రెస్ నేతల తీరుపై మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. భాజపా అంటే కాపీ పేస్ట్ పార్టీ అని మంత్రి ఎద్దేవా చేశారు. తెలంగాణ పథకాలు చూసి భాజపా వాళ్లు కాపీ కొడుతున్నారని ఆయన అన్నారు. మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ పబ్బం గడిపే పార్టీ భాజపా అని ధ్వజమెత్తారు.
ఇవీ చదవండి: