ETV Bharat / city

దుబ్బాకలో భాజపా గెలవబోతోంది: బండి సంజయ్​ - tension at karimnagar

దుబ్బాకలో భాజపా విజయం సాధించబోతోందని ఆ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ జోస్యం చెప్పారు. కమలదళాన్ని చూసి కేసీఆర్​భయపడుతున్నారన్న సంజయ్​.. దుబ్బాకలో ముఖ్యమంత్రి​ ఎందుకు పర్యటించడం లేదని ప్రశ్నించారు.

BANDI SANJAY
దుబ్బాకలో భాజపా గెలవబోతోంది: బండి సంజయ్​
author img

By

Published : Oct 27, 2020, 12:27 PM IST

దుబ్బాకలో భాజపా గెలవబోతోంది: బండి సంజయ్​

దుబ్బాకలో భాజపా గెలవబోతోందని ఆ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఎన్నికలను వాయిదా వేయించాలనే తెరాస కుట్రలు పన్నుతోందని సంజయ్ ఆరోపించారు. అధికార పార్టీ నేతలు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారని.. ఫలితంగా భాజపా నేతలే లక్ష్యంగా తనిఖీలు చేపడుతున్నారని మండిపడ్డారు. తెరాస నేతల ఇళ్లలో తూతూమంత్రంగా సోదాలు చేస్తున్నారన్నారు. ప్రగతి భవన్​లో డబ్బులు ఉన్నాయని తాము చెబుతున్నా.. అక్కడ ఎందుకు తనిఖీలు చేయడం లేదని ప్రశ్నించారు.

ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల జరగాలని తాము కోరుకుంటున్నట్లు సంజయ్​ తెలిపారు. భాజపాను చూసి ముఖ్యమంత్రి కేసీఆర్​ భయపడుతున్నారన్న సంజయ్​.. దుబ్బాకలో కేసీఆర్​ ఎందుకు పర్యటించడం లేదని ప్రశ్నించారు. తమ కార్యకర్తలను బెదిరిస్తున్నారని బండి సంజయ్​ ఆందోళన వ్యక్తం చేశారు.

సిద్దిపేట కలెక్టర్​ను బదిలీ చేశారని.. సీపీని ఎందుకు మార్చలేదో చెప్పాలన్నారు. దుబ్బాకలో ఎన్నికలు జరుగుతుంటే సిద్దిపేటలో తననేందుకు అరెస్ట్​ చేశారని సంజయ్​ నిలదీశారు. అప్పటి వరకు ప్రశాంతంగా వ్యవహరించిన సీపీ.. ఫోన్​ వచ్చాక ఎందుకు దురుసుగా ప్రవర్తించారన్నారు. ఆ సమయంలో సీపీకి ఎవరు ఫోన్​చేశారో చెప్పాలని డిమాండ్​ చేశారు.

ఇవీచూడండి: దీక్ష కొనసాగిస్తున్న బండి సంజయ్​.. ప్రగతిభవన్​ వద్ద భారీగా బలగాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.