ETV Bharat / city

Gangula: కాళేశ్వరం జలాలను చివరి ఆయకట్టు వరకు అందించాలి - కరీంనగర్​ జిల్లా వార్తలు

పెండింగ్ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి కాళేశ్వరం జలాలను చివరి ఆయకట్టుకు అందించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ సూచించారు. కరీంనగర్‌ కలెక్టరేట్‌లో ఎమ్మెల్యేలు, కలెక్టర్‌ శశాంక నీటిపారుదలశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Gangula: కాళేశ్వరం జలాలను చివరి ఆయకట్టు వరకు అందించాలి

author img

By

Published : Jun 4, 2021, 9:43 PM IST

కరీంనగర్‌ కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ఎమ్మెల్యేలు, కలెక్టర్‌ శశాంక నీటిపారుదలశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.పెండింగ్ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి కాళేశ్వరం జలాలను చివరి ఆయకట్టుకు అందించాలన్నారు. వానకాలం పంటల సాగుకు సాగు నీరు అందించేందుకు యుద్ధప్రాతిపదికన కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

మధ్య మానేరు ప్రాజెక్టు ఎడమ కాలువ నిర్మాణ పెండింగ్ పనులు త్వరగా పూర్తిచేసి ఈ వాన కాలంలో కాలువ కింది చెరువులన్నింటిని నీటితో నింపాలని మంత్రి ఆదేశించారు. జిల్లాకు 33 చెక్ డ్యాములు ప్రభుత్వం మంజూరు చేసిందని, చెక్ డ్యామ్​ల నిర్మాణ పనులు 50 శాతం మాత్రమే పూర్తయ్యాయని, మిగిలిన పనులు త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఇంజినీర్లకు సూచించారు.

ఇదీ చదవండి: Eatala Resign : ఎమ్మెల్యే పదవికి రేపు ఈటల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.