ETV Bharat / city

PrajaSangramaYatra: సమస్యలు వింటూ.. వినతిపత్రాలు అందుకుంటూ సాగుతున్న యాత్ర - తెలంగాణ వార్తలు

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(BJP TELANGANA STATE PRESIDENT BANDI SANJAY) చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర(PrajaSangramaYatra) ఆదివారంతో 30వ రోజుకు చేరుకుంది. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి నుంచి ఇవాళ్టి పాదయాత్రను బండి సంజయ్ ప్రారంభించారు.

PrajaSangramaYatra
PrajaSangramaYatra
author img

By

Published : Sep 26, 2021, 3:35 PM IST

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(BJP TELANGANA STATE PRESIDENT BANDI SANJAY)తలపెట్టిన ప్రజాసంగ్రామ యాత్ర(PrajaSangramaYatra) 30వ రోజుకు చేరుకుంది. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా(RAJANNA SIRCILLA DISTRICT) తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి నుంచి పాదయాత్రం ప్రారంభమైంది. యాత్రకు ముందు బద్దెనపల్లి వద్ద చాకలి ఐలమ్మ(chakali ilamma jayanthi) జయంతిని పురస్కరించుకొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

  • వీర వనిత చాకలి ఐలమ్మ గారి జయంతిని పురస్కరించుకొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. pic.twitter.com/kpkzK9LU4M

    — Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) September 26, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

యాత్రకు సంఘీభావంగా..

మానేరు భూ నిర్వాసితులు(Manair land settlers) బండి సంజయ్(BANDI SANJAY) ప్రజా సంగ్రామ యాత్రకు సంఘీభావంగా పాదయాత్రలో పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. తమ సమస్యలపై పోరాటం చేయాలని బండి సంజయ్​కి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం తొలగించిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు.. బండి సంజయ్(BANDI SANJAY)​ని కలిసి తమను విధుల్లోకి తీసుకునే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వినతిపత్రం అందజేశారు.

మగ్గం నేసిన సంజయ్

పాదయాత్ర(PrajaSangramaYatra)లో భాగంగా నేత కార్మికులు ఏర్పాటు చేసిన మగ్గం నేశారు. అనంతరం నేత కార్మికులు సంజయ్​ని సన్మానించారు. ఆదివారం పార్రంభమైన యాత్ర బద్దెనపల్లి నుంచి బయలుదేరి రామన్న పల్లె, బస్వాపూర్ మీదుగా ఇల్లంతకుంట మండలం రామోజీ పేట, పెద్ద లింగాపూర్ గ్రామాల్లో కొనసాగనుంది.

ఇవీ చూడండి: bandi sanjay letter to kcr: మంత్రివర్గంలో వారికి అవకాశమివ్వాల్సిందే.. కేసీఆర్​కు బండి సంజయ్ లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.