wife made Husband Funerals: జీవితాంతం తోడుగా ఉంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసిన భర్త.. అనారోగ్యంతో కన్నుమూశాడు. దీంతో కట్టుకున్న భార్యే అన్నీ తానై ఆ భర్తకు దహన సంస్కారాలు నిర్వహించి.. భర్త రుణం తీర్చుకుంది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చల్లూరి పోచయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయనకు పిల్లలు లేకపోవడంతో భార్య పోచమ్మే అన్నీ తానై హిందూ సాంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించింది.
భార్య పోచమ్మ భర్తకు నిప్పు పెట్టడాన్ని చూసిన గ్రామస్థులంతా కంటతడి పెట్టుకున్నారు. పోచయ్య గ్రామ పంచాయతిలో కొన్నేళ్లు సపాయి కార్మికుడిగా పని చేశాడు. ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవీ చదవండి: