తమ కుటుంబంపై హత్యాయత్నం జరిగి నెలరోజులు గడుస్తున్నా.. కరీంనగర్ జిల్లా చొప్పదండి పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని బాధితులు రాష్ట్ర మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. గత నెల సెప్టెంబర్ 19న కొంతమంది తమను ద్విచక్రవాహనంపై వెంబడించి, కత్తులతో దాడిచేశారని కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు. కేసు నమోదు చేసుకున్న చొప్పదండి పోలీసులు ఇప్పటివరకు నిందితులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులను ఆశ్రయించిన ఫలితం లేకపోవడం వల్లే హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నిందితులతో కుమ్మక్కైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, తమ కుటుంబానికి భద్రత కల్పించాలని మానవహక్కుల సంఘాన్ని బాధితుడు విజ్ఞప్తి చేశారు.
ఇవీచూడండి: ఓఎంసీ కేసు... విచారణ ఈనెల 30కి వాయిదా