ETV Bharat / city

ఉత్తరాంధ్ర విద్యాసంస్థలపై జగన్​ సర్కార్ శీతకన్ను - రాష్ట్ర విద్యావ్యవస్థ

EDUCATION SYSTEM IN AP: ఉత్తరాంధ్రపై ప్రేమ ఒలకబోస్తున్న వైకాపా ప్రభుత్వం.. అక్కడ విద్యాసంస్థల అభివృద్ధి, కొత్త సంస్థల ఏర్పాటుకు చేసింది మాత్రం శూన్యం. గత ప్రభుత్వం ఐఐఎం, ఐఐపీఈ, సమీర్‌ వంటి ఉన్నత విద్యాసంస్థలను ఉత్తరాంధ్రకు తీసుకొస్తే.. వైకాపా సర్కారు ఒక్కదాన్నీ ఏర్పాటు చేయలేదు. హైఎండ్‌ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఊసే లేదు. విజయనగరం జిల్లాకు గత ప్రభుత్వం గిరిజన వర్సిటీ తీసుకొచ్చి నిర్మాణం ప్రారంభిస్తే.. ఇప్పుడు దాన్ని కొనసాగించకపోగా స్థలాన్ని మార్చి గందరగోళానికి గురిచేసింది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆచార్యుల పోస్టుల భర్తీ సంగతి పక్కనబెట్టి.. నిధులు లాగేసుకోవడంపై దృష్టి సారించింది.

EDUCATION SYSTEM IN AP
EDUCATION SYSTEM IN AP
author img

By

Published : Oct 12, 2022, 12:03 PM IST

ఉత్తరాంధ్ర విద్యాసంస్థలపై శీతకన్ను వేసిన జగన్​ సర్కార్.. నిధులులేక వెలవెలబోతున్న విశ్వవిద్యాలయాలు ​

EDUCATION SYSTEM IN AP‍: 2019 డిసెంబర్ 13న ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సీఎం జగన్‌ చెప్పిన మాటలివి. ఆ పలుకులు పలికి మూడేళ్లవుతున్నా.. తలదించుకునే పరిస్థితి ఏమాత్రం మారలేదు. అధ్యాపక పోస్టులు భర్తీ చేయడం మాట అటుంచి, విద్యార్థులు చెల్లించిన ఫీజుల డబ్బులనూ తీసేసుకున్న ప్రభుత్వం.. వర్సిటీని నాశనం చేసింది. ఆంధ్ర వర్సిటీలో 936 పోస్టులకు గాను రెగ్యులర్ ఆచార్యులు 216 మందే ఉన్నారు. వర్సిటీకి నిధులు ఇవ్వకపోగా.. ఉన్నవాటినే రాష్ట్ర ఫైనాన్షియల్ సర్వీసెస్‌ కార్పొరేషన్‌లో డిపాజిట్‌ చేయాలని లాగేసుకుంటోంది.

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిస్థితి: ఇప్పటికే కార్పరేషన్‌లో ఆంధ్ర విశ్వవిద్యాలయం 10 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసింది. మంజూరైన పోస్టులకు జీతభత్యాలు, పింఛన్లకు 366 కోట్లు, మినిమం టైమ్‌ స్కేల్‌లో పనిచేసేవారికి మరో 26 కోట్ల రూపాయలు కావాలి. కానీ ప్రభుత్వం అన్నింటికీ కలిపి 280 కోట్లే ఇస్తోంది. ఫలితంగా ఫీజులు, ఇతర ఆదాయం నుంచి.. వర్సిటీ ఏటా 100 కోట్లకుపైగా అదనంగా ఖర్చుచేస్తోంది. ఇలా చేస్తే భవిష్యత్తులో వర్సిటీ పరిస్థితి ఏంటి..?, ఉత్తరాంధ్రకు గుండెకాయ లాంటి విశ్వవిద్యాలయంపై చూపించే ప్రేమ ఇదేనా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

గత ప్రభుత్వం ఉత్తరాంధ్రకు ఎంతో ప్రాధాన్యం ఇస్తూ.. జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థలను ఏర్పాటుచేసింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో 7 విద్యాసంస్థలు నెలకొల్పింది. విశాఖలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌-ఐఐఎం, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం, ఎనర్జీ-ఐఐపీఈ, సొసైటీ ఫర్‌ అప్లైడ్‌ మైక్రోవేవ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, రీసెర్చ్‌-సమీర్‌ను తీసుకొచ్చింది. విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయం, శ్రీకాకుళంలో ట్రిపుల్‌ ఐటీ ఏర్పాటుచేసింది. విశ్వవిద్యాలయాలు లేని విజయనగరంలో గురజాడ వర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోగా.. సెంచూరియన్ ప్రైవేట్‌ వర్సిటీని ఏర్పాటుచేయించింది.

అలాగే చాలా కాలం నుంచి కొరతగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలనూ పెట్టింది. జగన్‌ ప్రభుత్వం వచ్చాక ఉత్తరాంధ్రలో పెట్టిన ముఖ్యమైన విద్యాసంస్థ ఒక్కటీ లేదు. ఉత్తరాంధ్రకు గుండెకాయ లాంటి ఆంధ్ర వర్సిటీలో అధ్యాపక పోస్టుల భర్తీని కూడా పట్టించుకోలేదు. విశాఖలో ఇంజినీరింగ్ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని ప్రకటించి మూడేళ్లు గడిచినా.. ఇప్పటికీ దాని ఊసే లేదు. గత ప్రభుత్వం విజయనగరానికి మంజూరు చేసిన గురజాడ అప్పారావు విశ్వవిద్యాలయం స్థానంలో.. జేఎన్​టీయూ-గురజాడ వర్సిటీని ఏర్పాటు చేసి దాన్నే గొప్పగా చెబుతోంది.

ఐఐఎం, ఐఐపీఈ, సమీర్ లాంటి విద్యాసంస్థలతో విశాఖకు గత ప్రభుత్వం జాతీయ గుర్తింపు తీసుకొచ్చింది. అన్ని రాష్ట్రాల విద్యార్థులూ ఈ సంస్థల్లో ప్రవేశాలు పొందుతారు. హైఎండ్ నైపుణ్యాభివృద్ధి వర్సిటీ ఏర్పాటుకు గత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విద్యార్థుల ఆలోచనలను స్టార్టప్‌లుగా మార్చేందుకు ఇన్నోవేషన్ సొసైటీ ఏర్పాటుచేసింది. అరిలోవలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని నెలకొల్పింది. ఇందులో ఉపాధి అవకాశాలను కల్పించే కోర్సులపై శిక్షణ ఇస్తున్నారు. ఆంధ్ర వర్సిటీలో ఏర్పాటుచేసిన సీమెన్స్ శిక్షణ కేంద్రంలో.. ఏడాదికి 7 వేల మందికి శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది.

ఆంధ్ర వర్సిటీలో పోస్టుల హేతుబద్ధీకరణ చేసి.. 550 సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి గత ప్రభుత్వంలో స్క్రీనింగ్‌ పరీక్ష పూర్తిచేశారు. ఆ తర్వాత న్యాయవివాదాలతో ప్రక్రియ నిలిచిపోయింది. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత.. గత ప్రభుత్వం ప్రతిపాదించిన హైఎండ్‌ నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయాన్ని మూలన పడేసింది. కొత్తగా ఏర్పాటుచేస్తామని సీఎం జగన్‌ ప్రకటించి మూడేళ్లు గడిచినా.. ఇంతవరకూ అతీగతీ లేదు. ఇన్నోవేషన్ సొసైటీ కార్యకలాపాలు దాదాపుగా నిలిచిపోయాయి. సీమెన్స్‌ శిక్షణ కేంద్రంలో 7వేల మందికి శిక్షణ ఇచ్చే అవకాశం ఉన్నా, 3వేల మందితోనే సరిపెడుతున్నారు.

గిరిజన విశ్వవిద్యాలయంపై తీరని గందరగోలం: విభజన హామీల అమల్లో భాగంగా.. కేంద్రం రాష్ట్రానికి మంజూరు చేసిన జాతీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని అప్పటి ప్రభుత్వం విజయనగరం జిల్లాకు కేటాయించింది. కొత్తవలస మండలం రెల్లి గ్రామంలో ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. 524 ఎకరాలు సేకకరించిన గత ప్రభుత్వం.. 9 కోట్ల రూపాయలతో సగానికిపైగా ప్రహరీ నిర్మించింది. వైకాపా ప్రభుత్వం ఇక్కడి నుంచి స్థలాన్ని మార్చేసి గందరగోళానికి తెర తీసింది. మొదట పాచిపెంట మండలంలో స్థలాన్ని పరిశీలించింది. ఆ తర్వాత దీనిపై వెనక్కి తగ్గి... మెంటాడ, దత్తిరాజేరు మండలాల పరిధిలో స్థలాన్ని గుర్తించారు.

చినమేడపల్లి, మర్రివలస పరిధిలో 561.88 ఎకరాలను వర్సిటీకి కేటాయించారు. సేకరించిన భూమిలో 90.60 ఎకరాలు జిరాయితీ ఉంది. పరిహారం విషయం తేలకపోవడంతో నిర్మాణాల్లో జాప్యం జరుగుతోంది. మౌలిక సదుపాయాల కల్పనకు 61.06 కోట్లు మంజూరు చేసినా... ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. ప్రస్తుతం విజయనగరం ఏయూ ప్రాంగణంలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. వసతి సదుపాయం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రాష్ట్ర విభజన వరకు నూజివీడు, ఇడుపులపాయలోనే ట్రిపుల్‌ ఐటీలు ఉండగా.. 2016లో కొత్తగా శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ ఐటీలను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో వెయ్యి మంది విద్యార్థుల సామర్థ్యంతో ట్రిపుల్‌ ఐటీ పెట్టారు. ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్ కావడంతో.. 6 వేల మంది పిల్లలు ఒకేచోట ఇంటర్‌, ఇంజినీరింగ్ పూర్తిచేసే అవకాశం ఉంటుంది. 2016, 2017లో ట్రిపుల్‌ ఐటీ భవన నిర్మాణాలకు అప్పటి ప్రభుత్వం 90.50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. 2020 నుంచి ఇప్పటి వరకు 128.99 కోట్లు మంజూరు చేసినా.. 55.87 కోట్లే వెచ్చించారు. 66.70 కోట్ల రూపాయల పనులు కొనసాగుతుండగా.. మరో 6.42 కోట్ల విలువైన పనులు టెండర్ల దశలోనే ఉన్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.