TTD Board Decisions: కొత్త ఏడాదిలో శ్రీవారి దర్శన టికెట్లు పెంచాలని నిర్ణయం తీసుకున్నామని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సంక్రాంతి తర్వాత వీటిని పెంచుతామని స్పష్టం చేశారు. తిరుమల తితిదే పాలకమండలి నిర్ణయాలను వెల్లడించిన ఆయన... ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించాలని నిర్ణయించామన్నారు. సమావేశంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై చర్చించామని... గతేడాది మాదిరిగానే 10 రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు వైవీ సుబ్బారెడ్డి వివరించారు.
పద్మావతి పిల్లల ఆస్పత్రి నిర్మించటంతోపాటు అన్నమయ్య మార్గంలో రోడ్డు, నడక దారి నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు వల్ల దెబ్బతిన్న ఆలయాల పునరుద్ధరణ, శ్రీశైలంలో ఆలయ గోపురానికి బంగారు తాపడం చేయిస్తామని తితిదే చైర్మన్ స్పష్టం చేశారు. ఎఫ్ఎంఎస్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కమిటీ వేశామని తెలిపారు.
ఇదీ చూడండి: Broccoli farming: యూట్యూబ్లో చూశాడు.. లక్షలు గడిస్తున్నాడు