వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి మూడు రాజధానులపై మాట్లాడారు. ప్రస్తుతం 3 రాజధానుల అంశం కోర్టు పరిధిలో ఉందన్న ఆయన.. ఏపీ పరిపాలనా రాజధాని విశాఖకు తప్పకుండా వస్తుందని పునరుద్ఘాటించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడినుంచైనా పాలన చేయవచ్చనని.. సీఆర్డీఏ చట్టానికి మూడు రాజధానులకు ఎటువంటి సంబంధం లేదని విశాఖలో అన్నారు.
నగర సుందరీకరణకు చర్యలు..
జీవీఎంసీలో 98 వార్డులకు అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు స్ఫష్టం చేశారు. విశాఖ నగర అభివృద్ధిలో భాగంగా.. కైలాసగిరి-భోగాపురం మధ్య 6 వరుసల రహదారి నిర్మాణం, ముడసర్లోవ పార్కును ప్రముఖ అంతర్జాతీయ పర్యాటక స్థలంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. నగరాన్ని మురికివాడల రహితంగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పంచగ్రామాల సమస్య కోర్టులో ఉందన్న విజయసాయి.. తీర్పు వెలువడిన వెంటనే లబ్ధిదారులకు పట్టాలు అందిస్తామన్నారు.
- ఇదీ చదవండి: ఇలా అయితే.. కొవిడ్-26, కొవిడ్-32 తప్పవు!