ETV Bharat / city

ys viveka murder case: 'రెండు వ్యాజ్యాల్లో కౌంటర్ దాఖలు చేయాలి'

ys viveka murder case in HC: ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో దస్తగిరి అప్రూవర్‌గా మారేందుకు కడప కోర్టు అనుమతించింది. దీన్ని సవాలు చేస్తూ దాఖలైన 2 వ్యాజ్యాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఏపీ హైకోర్టు ఆదేశించింది.

ys viveka murder case
వివేకా హత్య కేసు
author img

By

Published : Dec 15, 2021, 7:46 AM IST

ys viveka murder case in HC: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో దస్తగిరి అప్రూవర్‌గా మారేందుకు కడప కోర్టు అనుమతించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన 2 వ్యాజ్యాల్లో కౌంటర్ దాఖలు చేయాలని.. సీబీఐని హైకోర్టు ఆదేశించింది. దస్తగిరి అప్రూవర్‌గా మారేందుకు అనుమతిస్తూ కడప చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్ క్షమాభిక్ష ప్రసాదించడాన్ని సవాలు చేస్తూ... నిందితులు ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్‌ రెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వారితరఫున సీనియర్‌ న్యాయవాదులు బి.ఆదినారాయణరావు, టీ.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు.

నిలువరించాలి

దస్తగిరి నిందితుడిగా చెప్పిన విషయాన్ని సీఆర్​పీసీ సెక్షన్‌ 164 కింద వాంగ్మూలంగా నమోదు చేసి సంబంధిత కోర్టులో సీబీఐ అభియోగపత్రం దాఖలు చేసిందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. ఓసారి 164 వాంగ్మూలం నమోదు చేశాక.. అప్రూవర్‌గా మారారని మరోసారి వాంగ్మూలం నమోదు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దిగువ కోర్టు దస్తగిరి వాంగ్మూలాన్ని నమోదు చేయబోతుందని.. దానిని నిలువరించాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు.

విచారణ వాయిదా

కౌంటర్‌ వేసేందుకు సమయం కావాలని సీబీఐ తరఫు న్యాయవాది చెన్నకేశవులు కోరగా.. న్యాయమూర్తి విచారణను వారం రోజులకు వాయిదా వేశారు. వ్యాజ్యంలో ప్రతివాదిగా ఉన్న దస్తగిరికి నోటీసులు జారీచేశారు. అటు వివేకా హత్యకేసులో ముగ్గురు నిందితులు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్‌, ఉమా శంకర్‌రెడ్డిల రిమాండు గడువును పులివెందుల కోర్టు ఈనెల 28వ తేదీకి పొడిగించింది. నిందితుల బెయిలు పిటిషన్‌పై వాదనలు ముగియగా నిర్ణయాన్ని ఈనెల 21కి వాయిదా వేసింది. ఇదే కేసులో ఎర్రగంగిరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి హైకోర్టులో వేసిన క్వాష్‌ పిటిషన్‌పై విచారణ ఈనెల 24వ తేదీకి వాయిదా పడింది.

ఇదీ చదవండి: Karvy Scam: కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌ సంస్థ రూ.3520 కోట్ల మోసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.