ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 73వ రోజు కొనసాగుతోంది. కడప జైలు అతిథి గృహంలో సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు. సునీల్ యాదవ్ బంధువు భరత్ యాదవ్‌ను అధికారులు ప్రశ్నిస్తున్నారు. అలాగే.. మహబూబ్ బాషా, నాగేంద్ర, మరో అనుమానితుడు సైతం సీబీఐ విచారణకు హాజరయ్యారు. పులివెందుల ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఎర్ర గంగిరెడ్డి విచారణకు హాజరయ్యారు.
మరోవైపు.. తన తండ్రి హత్య కేసు దర్యాప్తు పురోగతిపై సీబీఐ అధికారులను వైఎస్ వివేకా కుమార్తె సునీత కడపలో కలిసి.. ఆరా తీశారు. కేసు పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు సైతం దర్యాప్తు తీరును సునీతకు వివరించారు.
మంగళవారం విచారణ ఇలా..
వివేక హత్య కేసులో మంగళవారం ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని పులివెందుల ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సీబీఐ అధికారులు ప్రశ్నించారు. కేసులో భాస్కర్‌రెడ్డి కీలక అనుమానితుడిగా ఉన్నారు. మరోవైపు.. కడప జైలులో విచారణకు జగదీశ్వర్‌రెడ్డి, భరత్‌కుమార్ హాజరయ్యారు. ఎంపీ అవినాష్‌రెడ్డి చిన్నాన్న వైఎస్ మనోహర్‌రెడ్డిని కూడా సీబీఐ అధికారులు విచారించారు.
ఇదీ చదవండి: Gandhi Hospital Rape Case: 'గాంధీ'లో అత్యాచారంపై జాతీయ ఎస్సీ కమిషన్ ఆగ్రహం