ETV Bharat / city

YS Sharmila: వైఎస్​ షర్మిల కొత్త పార్టీ పేరు ఖరారు..! - వైఎస్​ షర్మిల కొత్త పార్టీ పేరు

తెలంగాణలో వైఎస్​ షర్మిల పెట్టబోయే కొత్త పార్టీ పేరు ఇదేనంటూ... వార్తలు గుప్పుమంటున్నాయి. "వైఎస్​ఆర్​ తెలంగాణ పార్టీ" పేరుతో ఇప్పటికే ఖరారైన్నట్టు తెలుస్తోంది. సీఎస్​ఈ ఆమోదం తెలిపినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ys sharmila new party name announced as ysr telangana party

author img

By

Published : Jun 3, 2021, 9:11 PM IST

వైఎస్​ షర్మిల పార్టీ పేరు దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తోంది. కొత్త పార్టీ రిజిస్ట్రేషన్​ కోసం కేంద్ర ఎన్నిక సంఘానికి... షర్మిల ప్రధాన అనుచరుడు వాడుక రాజగోపాల్​ దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. "వైఎస్​ఆర్​ తెలంగాణ పార్టీ" పేరుతో దరఖాస్తు చేసుకోగా.. సీఎస్​ఈ ఆమోదం తెలిపినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

వైఎస్సార్​టీపీకి షర్మిల ప్రధాన అనుచరుడు వాడుక రాజగోపాల్‌ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నట్లు ఆ పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నారు. ఈ పార్టీపై ఎవరికైనా... అభ్యంతరాలు ఉంటే ఈ నెల 16లోపు తెలపాలని మార్చిలో ఎన్నికల సంఘం నోటిసు ఇచ్చింది. అయితే ఇది ఎంత వరకు నిజం అన్నది తెలుసుకోవాలంటే... వైఎస్​ షర్మిల స్వయంగా పార్టీ పేరు ప్రకటించే వరకు వేచిచూడాల్సిందే.

ఇదీ చూడండి: Telangana Council: ప్రొటెం ఛైర్మన్​గా ఎమ్మెల్సీ భూపాల్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.