ఉమ్మడి ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల ఈరోజు సాయంత్రం కడప జిల్లా ఇడుపులపాయకు వెళ్లనున్నారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన తల్లి విజయమ్మతో కలిసి అక్కడికి చేరుకోనున్నారు. ఈ రాత్రికి ఇడుపులపాయ ఎస్టేట్‌లోనే ఆమె బస చేస్తారు. తెలంగాణలో కొత్త పార్టీ స్థాపించేందుకు సిద్ధమైన షర్మిల ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.
వైఎస్‌కు నివాళులు
గురువారం ఆయన జయంతి సందర్భంగా సమాధి వద్ద నివాళులు అర్పించనున్నారు. రేపు ఉదయం 8 గంటలకు ఆమె అక్కడకు చేరుకోనున్నారు. తాను స్థాపించనున్న కొత్త పార్టీ జెండాను తండ్రి సమాధి వద్ద ఉంచి ప్రార్థనలు చేస్తారు. అనంతరం రేపు మధ్యాహ్నం కడప నుంచి విమానంలో హైదరాబాద్ బయలుదేరనున్నారు.
పార్టీ ప్రకటన
తండ్రి పుట్టినరోజునే పార్టీ ప్రకటన ఉంటుందని ఆమె ఇదివరకే ప్రకటించారు. వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ప్రకటించనున్నట్లు షర్మిల తెలిపారు. ఇదివరకే పార్టీకి సంబంధించిన జెండా కూడా సిద్ధమైనట్లు షర్మిల అనుచర వర్గాలు తెలిపాయి. పార్టీ ప్రకటన అనంతరం ఆవిర్భావ సభ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి: