ETV Bharat / city

'వైద్య, ఆరోగ్య శాఖను బీసీ నాయకుడికి అప్పగించాలి' - corona cases in telangana

కొవాగ్జిన్ టీకా హైదరాబాద్​లోనే తయారవుతున్నా.. రాష్ట్ర ప్రజలకు ఇప్పటికీ వ్యాక్సిన్ ఇప్పించలేని స్థితిలో తెలంగాణ సర్కార్ ఉందని వైఎస్ షర్మిల ముఖ్య అనుచరురాలు ఇందిరాశోభన్ మండిపడ్డారు. ప్రజలు పిట్టల్లా రాలుతుంటే సీఎం కేసీఆర్ చోద్యం చూస్తున్నారని విమర్శించారు.

Indira shobhan, Indira shobhan about covid crisis
ఇందిరాశోభన్, కరోనా వ్యాప్తిపై ఇందిరాశోభన్
author img

By

Published : May 9, 2021, 10:03 AM IST

ముఖ్యమంత్రి కేసీఆర్.. తన వద్ద ఉన్న వైద్య, ఆరోగ్య శాఖను సమర్థుడైన బీసీ నాయకుడికి అప్పగించాలని వైఎస్ షర్మిల ముఖ్య అనుచరురాలు ఇందిరాశోభన్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే.. కేసీఆర్ చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు.

హైదరాబాద్​లోనే కొవాగ్జిన్ టీకా తయారవుతున్నా.. రాష్ట్ర ప్రజలకు ఇప్పటికీ వ్యాక్సిన్ ఇప్పించలేని స్థితిలో తెలంగాణ సర్కార్ ఉందని ఇందిరా శోభన్ అన్నారు. ఓవైపు కేసీఆర్.. మరోవైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. అంతా బాగానే ఉందంటూ మసిపూసి మారేడుకాయ చందంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.