ETV Bharat / city

Huzurabad Election: ఎన్నికల అధికారి తీరుపై సందేహం.. కేసీఆర్​తో...: వైఎస్​ షర్మిల - వైఎస్ షర్మిల ఫిర్యాదు

హుజూరాబాద్ ఎన్నికల అధికారిపై చీఫ్‌ ఎలక్షన్‌ కమిషన్ శశాంక్ గోయల్‌కు వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధినాయకురాలు వైఎస్ షర్మిల ఫిర్యాదు చేశారు. హుజూరాబాద్​లో నామినేషన్​ ప్రక్రియ సక్రమంగా సాగట్లేదని ఫిర్యాదులో తెలిపారు. ఎన్నికల అధికారి సీఎం కేసీఆర్​కు అమ్ముడు పోయారని షర్మిల ఆరోపించారు.

ys-sharmila-complaint-on-huzurabad-election-officer-about-nominations

author img

By

Published : Oct 7, 2021, 10:26 PM IST

'ఎన్నికల అధికారి సీఎం కేసీఆర్​కు అమ్ముడుపోయారు'

హుజూరాబాద్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్‌ను సస్పెండ్‌ లేదా.. బదిలీ చేయాలని వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధినాయకురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ వేయకుండా రకరకాల కారణాలతో అడ్డంకులు కల్పిస్తున్నారని షర్మిల ఆరోపించారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లు నామినేషన్‌ వేసేందుకు ముందుకు వస్తే వివిధ అడ్డంకులు చెప్తూ.. తిప్పి పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్ ఎన్నికల అధికారిపై చీఫ్‌ ఎలక్షన్‌ కమిషన్ శశాంక్ గోయల్‌కు షర్మిల ఫిర్యాదు చేశారు. హుజూరాబాద్​లో నామినేషన్​ ప్రక్రియ సక్రమంగా సాగట్లేదని ఫిర్యాదులో తెలిపారు.

ఎలా నమ్మాలి..

ఎన్నికల అధికారి సీఎం కేసీఆర్​కు అమ్ముడు పోయారని షర్మిల ఆరోపించారు. నామినేషన్​ ప్రక్రియలోనే ఇన్ని అడ్డంకులు కల్పిస్తున్నాడంటే.. ఇక ఎన్నికల్లో, కౌంటింగ్​లో పారదర్శకంగా ఉంటాడని ఎలా నమ్మాలని ప్రశ్నించారు. ఇన్ని నామినేషన్లు పడుతున్నాయంటే.. దానికి కారణం నిరుద్యోగుల పట్ల కేసీఆర్​ నిర్లక్ష్యమేనని స్పష్టం చేశారు. ఆత్మహత్యలు చేసుకోకండి అంటూ... నిరుద్యోగులకు ఏరోజైనా భరోసా ఇచ్చారా అని కేసీఆర్​ను నిలదీశారు. సుమారు 500 మంది నిరుద్యోగులు నామినేషన్​ వేసేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

ముందేందుకు చెప్పలే...

నామినేషన్​ వేసే అభ్యర్థి రెండు డోసుల వ్యాక్సిన్​ తీసుకుని ఉండాలన్న నియమం ముందేందుకు పెట్టలేదని షర్మిల ప్రశ్నించారు. వ్యాక్సినేషన్​ ప్రక్రియలో ప్రభుత్వం చెందిన వైఫల్యానికి ప్రజలనెందుకు ఇబ్బంది పెడుతున్నారని అధికారులపై మండిపడ్డారు. నామినేషన్ గడువు సమయం పెంచాలని షర్మిల డిమాండ్​ చేశారు. ఈ అంశంలో కోర్టుకు కూడా వెళ్లేందుకు సిద్ధమని షర్మిల స్పష్టం చేశారు.

ఓడిపోతామని భయపడుతున్నారా..?

"తెరాస అభ్యర్థులకు ఎలాంటి అడ్డంకులు లేకుండా.. ఇండిపెండెంట్​ల నామినేషన్ తీసుకునేందుకు మాత్రం ఇన్ని ఇబ్బందులకు ఎందుకు గురిచేస్తున్నారు. మా పిలుపు మేరకు... ఫీల్డ్​ అసిస్టెంట్లు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్​ వేసేందుకు వస్తే ఎందుకు అడ్డుకుంటున్నారు. నిజామాబాద్​లో జరిగినట్టే ఇక్కడ కూడా జరుగుతుందని భయపడుతున్నారా..? వీళ్లందరికీ పదో పరకో పడే ఓట్లు కూడా పడకపోతే ఓడిపోతామనుకుంటున్నారా..? పోలీసులు కూడా సీఎం కేసీఆర్‌కు తొత్తులుగా మారారు. హుజురాబాద్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి.. కేసీఆర్‌కు అమ్ముడు పోయాడు. రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకుంటేనే నామినేషన్‌ వేసేందుకు రావాలని అంటున్నారు. మరి.. ఈ విషయాన్ని ముందెందుకు చెప్పలేదు. అసలు మన రాష్ట్రంలో సగం మందికి ఇప్పటికీ మొదటి డోస్​ వ్యాక్సినేషనే పూర్తికాలేదు. ఇక సెకండ్​ డోస్​ అయితే సుమారు 50 లక్షల మందికి మాత్రమే వేశారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల నామినేషన్​ వేసే వాళ్లను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు." -వైఎస్ షర్మిల, వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధినాయకురాలు

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.