లాక్డౌన్ కారణంగా అన్ని రంగాలకు చెందిన ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్ పేర్కొన్నారు. నిరుపేదలకు ఒక్కో కుటుంబానికి పదివేల రూపాయలను కేంద్రం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని సామాజిక మాద్యమాల ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లతామన్నారు.
కరోనా కష్టకాలంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తే కొంత ఊరటనిచ్చినట్లు అవుతుంది. లాక్‌డౌన్‌తో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ప్రతి పేదలను ఆదుకోవాలి. కరోనా నిర్థరణ పరీక్షలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. పక్క రాష్ట్రాల్లో ఇప్పటివరకు లక్షల్లో కొవిడ్-19 టెస్టులు చేస్తే ఇక్కడ మాత్రం కేలవలం 16వేల లోపే చేశారు. దీన్ని బట్టి అర్థంమవుతోంది ప్రభుత్వం పనితీరు. -యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్
ఇదీ చూడండి: భారత వైమానిక దళంలోకి 'ఫ్లయింగ్ బుల్లెట్లు'