ETV Bharat / city

vaccine: ఏపీలో విషాదం.. యువకుడు మృతికి వ్యాక్సినే కారణమా..? - ఆసుపత్రి

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన ఓ యువకుడు మంగళగిరిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతను కొవిడ్​ వ్యాక్సిన్​ వికటించి మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకోక ముందు తమ కుమారుడు బాగానే ఉన్నారన్న తల్లిదండ్రులు.. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అస్వస్థతకు గురయ్యారని తెలిపారు.

vaccine dead
వ్యాక్సిన్ వికటించి యువకుడు మృతి..?
author img

By

Published : Aug 24, 2021, 7:53 PM IST

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన ఓ యువకుడు మంగళగిరిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ నెల 21న పాలకొల్లులో వ్యాక్సిన్ తీసుకున్న యువకుడు అనంతరం అనారోగ్యం పాలయ్యాడు. వెంటనే స్పందించిన ఆ యువకుని తల్లిదండ్రులు.. స్థానికంగా ఓ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించిందని విజయవాడ లేదా ఇతర ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.

అయితే మంగళగిరిలోని ఓ ఆస్పత్రిలో చేర్పించగా.. యువకుడికి మెదడులోని నరాలు చిట్లినట్లు వైద్యులు గుర్తించారు. వ్యాక్సిన్ తీసుకోక ముందు తమ కుమారుడు బాగానే ఉన్నాడని..వ్యాక్సిన్ తీసుకున్న తర్వాతే అస్వస్థతకు గురైనట్లు తల్లిదండ్రులు చెప్పారు.

ఇదీ చూడండి:ప్రగతి భవన్‌ ముట్టడికి నిరుద్యోగుల యత్నం... ఉద్రిక్తం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.