ETV Bharat / city

afghan girl letter: అప్గాన్​లో పరిస్థితులపై ప్రముఖ హీరోయిన్​కు యువతి లేఖ

'తాలిబన్లు రాకముందు మాకు హక్కులు ఉండేవి. కానీ, వారి రాకతో అంతా మారిపోయింది' అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ.. హాలీవుడ్​ నటి ఏంజెలినా జోలీకి ఓ అఫ్గాన్(Afghan news)​ యువతి లేఖ రాసింది. దీన్ని ఏంజెలినా జోలీ.. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్​ చేశారు. తాలిబన్ల దురాక్రమణతో(Afghanistan Taliban) అఫ్గాన్​ ప్రజలు అనుభవిస్తున్న వెతలకు సాక్ష్యంగా నిలుస్తోందీ లేఖ!

Young woman's letter to the famous heroine
ప్రముఖ హీరోయిన్​కు యువతి లేఖ
author img

By

Published : Aug 22, 2021, 9:32 PM IST

Updated : Aug 22, 2021, 10:44 PM IST

"నేనొక అఫ్గాన్‌ యువతిని. తాలిబన్లు రాకముందు మేమంతా ఉద్యోగాలు చేసుకొనేవాళ్లం. పాఠశాలలకు వెళ్లేవాళ్లం. మాకు హక్కులు ఉండేవి. తాలిబన్లరాకతో అంతా మారిపోయింది. వారిని చూసి భయపడుతున్నాం. మా కలలన్నీ కల్లలయ్యాయి. హక్కులు కోల్పోయాం. బయటికి రాలేని పరిస్థితి. చదువులు, ఉద్యోగాల సంగతి చెప్పక్కర్లేదు. తాలిబన్లు మారారని కొందరు చెబుతున్నారు. నేనలా భావించడం లేదు. ఇప్పుడు మా జీవితాలు చీకటిమయమయ్యాయి. స్వేచ్ఛను కోల్పోయాం. మళ్లీ మేం బందీలైపోయాం" ఇదీ హాలీవుడ్‌ నటి ఏంజెలినా జోలీకి ఓ అఫ్గాన్‌ యువతి రాసిన లేఖ.

నటి ఏంజెలినా జోలీకి అఫ్గాన్‌ యువతి రాసిన లేఖ.

ఈ లేఖను ఏంజెలినా జోలీ.. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇప్పటివరకు జోలీ.. 'ఇన్‌స్టాగ్రామ్‌' ఖాతా తెరవలేదు. అయితే అఫ్గాన్‌ ప్రజల(Afghan news) వెతలను చాటిచెప్పేందుకే తాను ఈ ఖాతాను తెరిచినట్లు ఆమె పేర్కొన్నారు. ఇక నుంచి ఆ దేశ ప్రజల బాధలను ప్రపంచంతో పంచుకుంటానని, వారికి సహాయం చేయడానికి తన వంతు కృషిచేస్తానని తెలిపారు.

ఇదీ చూడండి: రూ.70 వేల కోట్ల నిధి తాలిబన్లకు దక్కనిది అందుకే..!

Last Updated : Aug 22, 2021, 10:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.