ETV Bharat / city

మీ పిల్లలూ మంచోళ్లేనా.. పేరెంట్స్ ఓ కన్నేయండి..!

కరోనాతో వచ్చిన ఈ లాక్‌డౌన్‌ కారణంగా పిల్లల్లో కొత్త కోణాన్ని గమనించారు తల్లిదండ్రులు. ఇన్నాళ్లూ మంచోళ్లే అనుకున్నా వారు తమకు తెలియకుండా చెడుబాటలో వెళ్తున్నారన్న విషయాలు తెలిసొచ్చాయి. తమ వద్దకు వచ్చే కేసుల్లో 17-21 ఏళ్ల వయసున్న వారే ఎక్కువయ్యాయంటున్నారు నిపుణులు. అయితే.. ఇదే వారని మార్చేందుకు సరైన సమయమని నిపుణులు చెబుతున్నారు.

young people addicted to drugs during lockdown
మంచోళ్లే అనుకున్నాం.. ముంచే కోణమూ ఉంది..!
author img

By

Published : Jun 3, 2020, 9:42 AM IST

Updated : Jun 3, 2020, 9:50 AM IST

  • 'మా అబ్బాయి ఈమధ్య ఏదో కొత్త పదార్థం తీసుకుంటున్నాడు.. దాదాపు పదిగంటలకు పైగా నిద్రమత్తులోనే ఉంటున్నాడు. ఏంటని ప్రశ్నిస్తే తనకేం తెలియదని బదులిస్తున్నాడు. ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాంటి అలవాట్లు ఉండేవి కావు..' రాచకొండ పోలీస్‌ ప్రత్యేక టీంకు ఓ కొడుకు గురించి తండ్రి ఫిర్యాదు.
  • నగరంలోని ఓ ప్రముఖ కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదువుతున్న విద్యార్థిని ఫోన్‌ని చూసిన తల్లికి.. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తున్న ఫొటోలు, కొత్త వ్యక్తులతో చేసే అసభ్యకర చాటింగ్‌తోపాటు, తనకు గంజాయి సేవించే అలవాటూ ఉందని తెలిసింది. ఇదేంటని మందలిస్తే కోపంతో అన్నం తినడం మానేసింది ఆ అమ్మాయి..
  • 18 ఏళ్ల కుర్రాడు. లాక్‌డౌన్‌లో తొలి వారంరోజులు బాగానే ఉన్నాడు. ఉన్నట్టుండి కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటం మొదలైంది. గమనించిన తల్లి అతన్ని ప్రశ్నించగా.. తనకు గంజాయి లేకపోతే ఊపిరాడనట్లవుతోందంటూ బోరుమన్నాడు.. దీంతో అతన్ని సముదాయించి మానసిక వైద్యుని దగ్గరికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు.

ఈ మూడే కాదు.. నగరంలో ఇలాంటి ఘటనలెన్నో.. కరోనా వల్ల తల్లిదండ్రులకు వారి పిల్లల చెడు వ్యసనాలు, వ్యవహారాలన్నీ ప్రత్యక్షంగా గమనించే అవకాశం వచ్చింది. అయితే లాక్‌డౌన్‌ వల్లే కొందరిలో ఈ ప్రవర్తన వచ్చిందనే భావనతో మానసిక నిపుణుల్ని సంప్రదిస్తుండగా.. ఇది ఇప్పటిది కాదు గతం నుంచే ఉన్నా గుట్టుగా జరుగుతుందనే విషయం తెలిసి అవాక్కై ఆందోళన వ్యక్తం చేయడం తల్లిదండ్రుల వంతవుతోంది. తమ వద్దకు వచ్చే కేసుల్లో 17-21 ఏళ్ల వయసున్న వారిలో కొత్త మార్పుల్ని గమనించామంటూ వచ్చేవే ఇప్పుడు ఎక్కువయ్యాయంటున్నారు నిపుణులు. అయితే ఇది మంచికే అని.. వారిని మంచి దారిలోకి తెచ్చుకునే సమయం కూడా ఇదేనని చెబుతున్నారు మానసిక వైద్య నిపుణులు.

తట్టుకోలేక తెగిస్తున్నారు..

లాక్‌డౌన్‌ మొదలైన వారందాకా ఇలాంటి పిల్లల్లో ఎలాంటి మార్పులు కనిపించలేదు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ వ్యసనాలకు దూరంగా ఉండలేక బయటపడుతున్నారు. వీరిలో గంజాయి, సిగరెట్లు అలవాటు ఉన్నవారు ఇంటికే తెచ్చుకునేందుకు తెగిస్తున్నారు. నీలిచిత్రాలు లాంటివాటికి అలవాటు పడిన అమ్మాయిలు, అబ్బాయిలు ఏకాంతం కోరుకుంటూ ఇంట్లోవాళ్లపై కోపం ప్రదర్శిస్తున్నారు. వీరిలో 20 శాతం మాత్రమే లాక్‌డౌన్‌ ఒత్తిడిలో వీటికి బానిసలవుతుండగా.. మిగతా 80 శాతం మందికి గతం నుంచే ఈ అలవాట్లున్నాయని చెబుతున్నారు నిపుణులు.

పిల్లల చెడు అలవాట్ల గురించి తెలిసొచ్చింది కాబట్టి వారిని సంస్కరించుకునేందుకు ఇదే మంచి సమయం. కోపంతో మార్చాలని చూస్తే అది వారిని మరింత తప్పుదారిలోకి నెడుతుంది. ప్రశాంతంగా సముదాయించాలి. మంచీచెడులు వివరించే ప్రయత్నం చేయాలి. ఈ వయసులో సాధారణంగా వచ్చే మార్పులే ఇవి. నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.

డాక్టర్‌ కళ్యాణ్‌ చక్రవర్తి, మానసిక వైద్యులు

ఉరుకుల పరుగుల జీవితాల్లో పడి..!

ఉరుకుల పరుగుల జీవితాల్లో వ్యక్తిగత, వృత్తిగత విషయాలకే పరిమితమవుతున్న తల్లిదండ్రులు పిల్లల విషయంలో అశ్రద్ధ చూపిస్తున్నారంటున్నారు నిపుణులు. దీనికితోడు పాఠశాల స్థాయిలో మారుతున్న వాతావరణం పిల్లల్ని చెడుదారుల్లోకి మళ్లిస్తోంది. అడిగేవారు లేకపోవడంతోపాటు అడగకుండా కూడా చేసుకునే విధంగానే చాలామంది పిల్లలు ఇళ్లలో నటిస్తున్నారు. ఇప్పుడు లాక్‌డౌన్‌తో వచ్చిన కాలాన్ని వారితో గడిపేందుకు కుటుంబసభ్యులు ప్రయత్నించినా వారు మాత్రం స్మార్ట్‌ఫోన్లు, సామాజిక మాధ్యమాలతో గడిపేందుకు ఇష్టపడుతున్నారు.

Last Updated : Jun 3, 2020, 9:50 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.