ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దయవల్లే తెదేపా ఇంకా బతికుందని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు అన్నారు. సీఎం ఒప్పుకుంటే వైకాపాలోకి చేరేందుకు తెదేపా ఎమ్మెల్యేలంతా సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. తెదేపా హయాంలోని ప్రతి స్కాం వెనుక చంద్రబాబు, లోకేశ్ ఉన్నారని వీరభద్రరావు ఆరోపించారు. తెదేపా నేతల అరెస్టులతో చంద్రబాబు వెన్నులో వణుకు మొదలైందన్నారు. అందుకే చంద్రబాబు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. తప్పు చేసిన వారిపైనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన స్పష్టం చేశారు.
ఏపీ సీఎం జగన్ వల్లే తెదేపా ఇంకా బతికే ఉంది : దాడి వీరభద్రరావు - తెదేపా నేతల అరెస్టు వార్తలు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ తలుచుకుంటే తెదేపా ఎమ్మెల్యేలంతా వైకాపాలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వెఎస్ఆర్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు తెలిపారు. తెదేపా హయాంలోని ప్రతి స్కాం వెనుక చంద్రబాబు, లోకేశ్ ఉన్నారని ఆయన ఆరోపించారు.