ETV Bharat / city

ఏపీలో జగన్ రూల్ ఆఫ్ లా ప్రత్యేకంగా తెచ్చారా?: యనమల - రైతుల అరెస్టుపై యనమలు కామెంట్స్

ఆంధ్రప్రదేశ్​లో తెదేపా నాయకులను గృహనిర్బంధం చేయడాన్ని ఆ రాష్ట్ర శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఖండించారు. శాంతియుత నిరసనలను అడ్డుకోవడం సరికాదని మండిపడ్డారు.

yanamala-fires-on-ysrcp-govt-over-tdp-leaders-hosue-arrest
ఏపీలో జగన్ రూల్ ఆఫ్ లా ప్రత్యేకంగా తెచ్చారా?: యనమల
author img

By

Published : Oct 31, 2020, 4:41 PM IST

"ఏపీలో చట్టబద్ధ పాలన ఉందా? లేక జగన్ రూల్ ఆఫ్ లా’’ ప్రత్యేకంగా తెచ్చారా అని శాసనసమండలి ప్రతిపక్ష నేత యనమల ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని అణచివేత ఏపీలో ఉందని మండిపడ్డారు. ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారన్న యనమల.. రాజ్యాంగ హక్కులను హరించివేశారని ఆరోపించారు. దరఖాస్తు చేసినా నిరసనలకు అనుమతులు ఇవ్వలేదని.. ప్రశ్నించే గొంతును నొక్కేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలాంటి దమనకాండ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదని పేర్కొన్నారు. అక్రమ గృహ నిర్బంధాలు అప్రజాస్వామికం, రాజ్యాంగ వ్యతిరేకమని యనమల అన్నారు. వైకాపా రాజ్యాంగ వ్యతిరేక చర్యలను ప్రతిఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి:ప్రభుత్వాలే మారుతున్నాయి.. కార్మికుల బతుకులు కాదు: చాడ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.