ETV Bharat / city

మాస్కు.. ఎవరు, ఎప్పుడు, ఎలాంటిది ధరించాలంటే? - when should wear mask?

భారత్​ను కరోనా తాకి ఏడాది దాటింది. గత ఏడాది నుంచి మాస్కులు దేశ ప్రజల జీవితంలో ఓ భాగమయ్యాయి. వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో మాస్కులు కీలక పాత్ర పోషిస్తున్నాయని నిపుణులు పదేపదే చెబుతున్నారు. మరి ఎలాంటి మాస్కు ధరించాలి? ఎప్పుడు పెట్టుకోవాలి వంటి సందేహాలు తీరుస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ వీడియో విడుదల చేసింది.

mask, mask must, which mask is best
మాస్కు మస్ట్, మాస్కు ముఖ్యం, ఏ మాస్కు మంచిదంటే
author img

By

Published : Apr 22, 2021, 1:09 PM IST

కరోనా వెలుగు చూసిన దగ్గర్నుంచి మాస్కులు మన జీవితంలో ఓ భాగమయ్యాయి. ఈ వైరస్‌ బారిన పడకుండా ఉండడానికి వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ఎంత ముఖ్యమో.. మాస్కులు ధరించడం అంతకంటే ముఖ్యమని నిపుణులు పదే పదే నొక్కి వక్కాణిస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది క్లాత్‌ మాస్కుల్ని ఎంచుకుంటే.. మరికొంతమంది బయట దొరికే మెడికల్‌ మాస్కుల్ని కొని ధరిస్తున్నారు. ఏదేమైనా, మాస్కులు ధరించడానికి మనం అలవాటు పడిపోయినా.. అసలు ఎవరు ఎలాంటి మాస్కులు ధరించాలి? ఎప్పుడెప్పుడు పెట్టుకోవడం మంచిది? అన్న పలు సందేహాలు కొంతమందిలో ఉన్నాయని చెప్పచ్చు. అయితే వాటన్నింటినీ ఒక్క వీడియో ద్వారా నివృత్తి చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ). ఎవరెవరు ఎలాంటి మాస్కులు ధరించాలి, ఎప్పుడు ధరించాలో సూచిస్తూ తాజాగా కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. మరి, అవేంటో మనమూ తెలుసుకుందాం రండి...

maskcdcguidlinesgh650-2.jpg
మాస్కు ఎలా ధరించాలి?

మొదటి దశ కంటే రెండో దశలో కరోనా విజృంభణ మరింత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఇంట్లో కూడా మాస్క్‌ ధరించడం మంచిదని చెబుతున్నారు నిపుణులు. అలాగని అందరూ బయట షాప్స్‌లో ఈజీగా కొని ధరించే మెడికల్‌/సర్జికల్‌ మాస్కుల్ని ఎంచుకుంటే వాటికి కొరత ఏర్పడుతుంది. పైగా అవి ఒకసారి వాడి పడేసేవి కాబట్టి వాటి కారణంగా వాతావరణ కాలుష్యం కూడా అధికమవుతుంది. అందుకే అలాంటి మాస్కుల అవసరం అందరికీ లేదంటోంది డబ్ల్యూహెచ్ఓ.

మెడికల్‌/సర్జికల్‌ మాస్కులు ఎవరికి?!

maskcdcguidlinesgh650-6.jpg
మెడికల్‌/సర్జికల్‌ మాస్కులు ఎవరికి?!
  • వైద్యులు - ఆరోగ్య కార్యకర్తలు
  • కరోనా లక్షణాలతో బాధపడుతోన్న వారు
  • కరోనా బాధితులకు సేవ చేస్తోన్న వారు

వైరస్‌ విస్తృతి ఎక్కువగా ఉండే ప్రదేశాలు, కనీసం ఒక మీటర్‌ భౌతిక దూరం పాటించలేని ప్రదేశాల్లో.. 60 ఏళ్లు పైబడిన వారు, పలు ఆరోగ్య సమస్యలున్న వారు ఈ మెడికల్‌ మాస్క్‌ ధరించడం తప్పనిసరి!

maskcdcguidlinesgh650-1.jpg
వీరికి క్లాత్‌ మాస్కులు!

వీరికి క్లాత్‌ మాస్కులు!

  • కరోనా లక్షణాలు లేని వారు.. వైరస్‌ విస్తృతి అధికంగా ఉండే ప్రదేశాలు, కనీసం ఒక మీటర్‌ సామాజిక దూరం పాటించలేని ప్రదేశాలకు వెళ్లినప్పుడు క్లాత్‌ మాస్కులు ధరించాలి.
  • సామాజిక కార్యకర్తలు, క్యాషియర్స్‌, సర్వర్స్‌ని కలిసే వ్యక్తులు గుడ్డతో తయారుచేసిన మాస్కులు ధరించడం ముఖ్యం.
  • ప్రజా రవాణా, పని ప్రదేశాలు, గ్రాసరీ స్టోర్స్‌, ఎక్కువమంది గుమిగూడే ప్రదేశాల్లో క్లాత్‌ మాస్కులు మనకు రక్షణ కల్పిస్తాయి.

వీటితో పాటు మాస్కులు ధరించే విషయంలో ఇతర సందేహాలేమైనా ఉంటే సంబంధిత నిపుణుల్ని అడిగి నివృత్తి చేసుకోవాలని, వైరస్‌ను మన జీవితాల్లోంచి సమూలంగా తొలగించేందుకు మాస్కులు మనకు శ్రీరామ రక్ష అని చెబుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ.

ఇలా ఎంచుకోండి!

maskcdcguidlinesgh650-5.jpg
ఇలా ఎంచుకోండి!
  • ఇక క్లాత్‌ మాస్కుల్ని ఎంచుకునే విషయంలో కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలంటూ సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) ఇటీవలే పలు మార్గదర్శకాలను జారీ చేసింది. అవేంటంటే..!
  • క్లాత్‌ మాస్కులు ఎంచుకునే వారు రెండు లేదా అంతకంటే ఎక్కువ లేయర్లున్న, సులభంగా శ్వాస తీసుకోవడానికి వీలుగా ఉన్న సౌకర్యవంతమైన మాస్క్‌ను ఎంపిక చేసుకోవాలి. అలాగే ఈ క్రమంలో వినైల్‌ ఫ్యాబ్రిక్‌తో రూపొందించిన మాస్కులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే దాన్ని ధరించడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురు కావచ్చు.
  • మాస్క్‌ ముక్కు, నోటిని పూర్తిగా కప్పి ఉంచేలా.. ఇరువైపులా (బుగ్గల వద్ద) గ్యాప్స్‌ లేకుండా ఫిట్‌గా ఉండేలా చూసుకోవాలి.
  • ముక్కు దగ్గర నోస్‌ వైర్‌/నోస్‌ స్ట్రిప్‌ ఉండే మాస్క్ని ఎంచుకుంటే గాలి బయటకు పోకుండా, బయటి గాలిని మనం పీల్చకుండా జాగ్రత్తపడచ్చు.
  • మాస్క్‌కు బదులుగా గైటర్‌ (ముక్కు, నోరు, మెడను కప్పి ఉంచే మాస్క్‌ లాంటి వస్త్రం)ను కూడా వాడచ్చు.

రెండేళ్ల లోపు చిన్నారులకు మాస్క్‌ వద్దే వద్దు. ఇక రెండేళ్లు దాటిన పిల్లలకు ఎంచుకునే క్లాత్‌ మాస్క్‌ కూడా వారికి సరిగ్గా ఫిట్‌ అయ్యేలా చూసుకోవాలి.

మాస్క్‌తో పాటు స్కార్ఫ్‌ ధరించచ్చు. అలాగని స్కార్ఫ్‌ మాస్క్‌కి ప్రత్యామ్నాయం కానే కాదు.

ఇక మాస్క్‌ పెట్టుకునే ముందు, తొలగించే ముందు చేతులు శుభ్రం చేసుకోవడం/శానిటైజ్‌ చేసుకోవడం తప్పనిసరి.

ఉపయోగించిన క్లాత్‌ మాస్కులను వేడి నీరు, డిటర్జెంట్‌తో చేత్తో అయినా ఉతుక్కోవచ్చు.. లేదంటే వాషింగ్‌ మెషీన్‌లో అయినా వేయచ్చు. అయితే కొన్ని రకాల మాస్కులను మాత్రం చేత్తో ఉతకడమే మంచిది. అందుకే- మాస్కులు కొన్న తర్వాత ప్యాక్ పైన ఉండే సూచనలను క్షుణ్ణంగా చదవడం మంచిది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.