Amaravati Capital Works Restarted : ఏపీ రాజధాని అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసుల అధికారుల కోసం నిర్మించిన అపార్టుమెంట్లలో మిగిలిపోయిన పనుల్ని సీఆర్‌డీఏ మళ్లీ ప్రారంభించింది. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చాక.. రాజధాని పనుల్ని నిలిపివేసే సమయానికే ఎమ్మెల్యేలు, ఏఐఎస్ అధికారుల అపార్ట్‌మెంట్ భవనాల నిర్మాణం దాదాపుగా కొలిక్కి వచ్చింది. కొంత మొత్తంలో కాంక్రీట్ పనులు, టైల్స్, రంగులు వేయడం, ఏసీలు అమర్చడం, విద్యుత్ ఏర్పాటు వంటివి మిగిలి ఉన్నాయి. వారం రోజుల నుంచి ఆ పనులను మళ్లీ ప్రారంభించారు.
Amaravati Works Restarted in AP : రాజధానిలోని పరిపాలన నగరంలో, రాయపూడి గ్రామానికి సమీపంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం 12 టవర్లు, ఏఐఎస్ అధికారుల కోసం 6 టవర్లు నిర్మించారు. ఈ మొత్తం పనులకు ఒకే ప్యాకేజీగా అప్పట్లో టెండర్లు పిలవగా, ఎన్‌సీసీ సంస్థ దక్కించుకుంది. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.731 కోట్లు.