ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో బొగ్గు ఉత్పత్తి లక్ష్యం కన్నా.. కార్మికుల ప్రాణాలు, ఆరోగ్య రక్షణే ముఖ్యమని సింగరేణి సీఎండీ శ్రీధర్ స్పష్టం చేశారు. గత నాలుగు నెలల్లో బొగ్గు ఉత్పత్తి 50 శాతం తగ్గిందని తెలిపారు. పరిస్థితులు చక్క బడిన తర్వాత బొగ్గు ఉత్పత్తిని పెంచుకోగలమన్నారు. కార్మికులకు కరోనా పరీక్షలు, చికిత్సల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు శ్రీధర్ వివరించారు.
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో శ్రీధర్.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. సింగరేణి భవన్లో మెడికల్ సూపరింటెండెంట్లు బి.శివకుమార్, బాలకోటయ్య, కో ఆర్డినేటర్‌ను.. సత్కరించారు.
ఇవీచూడండి: యాక్టివ్ కరోనా కేసులు 6.6 లక్షలే!