Autonagar Bandh: ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్లు 5,6 లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ఆటోనగర్‌లో కార్మికులు, వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. నగరాలకు దూరంగా పారిశ్రామిక ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ఇటీవల జీవో తెచ్చింది. ఒకప్పుడు నగర శివారు, ఇప్పుడు నగరం నడిబొడ్డున ఉన్న ఆటోనగర్‌కు తాజా జీవోల నుంచి వెసులుబాటు ఇవ్వాలని వ్యాపారులు డిమాండ్ చేశారు. ఆటోనగర్ పారిశ్రామికవాడను కమర్షియల్‌గా మారుస్తూ ఇచ్చిన జీవోలను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ప్రాంతాన్ని కమర్షియల్ చేస్తూ 50 శాతం పన్ను కట్టమని తెచ్చిన జీవోను వ్యతిరేకిస్తూ బంద్ చేపట్టినట్లు కార్మిక, వ్యాపార వర్గాలు తెలిపాయి. 50 శాతం పన్ను కట్టాలంటే మా వల్ల కాదని వ్యాపారులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ఒక మహిళను గౌరవించే విధానం ఇదేనా..? : గవర్నర్ తమిళిసై