ETV Bharat / city

'కరోనా భయంతో ఆత్మహత్య చేసుకున్న మహిళ' - కరోనా భయంతో ఆత్మహత్య చేసుకున్న మహిళ

కరోనా భయం ప్రాణాలు తీస్తుంది. ఇంట్లో అద్దెకు ఉంటున్న వారికి వైరస్ సోకగా.. తనకు కూడా సోకుతుందేమో అన్న భయంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్​లోని మలక్​పేట పోలీస్​స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది.

women suicide in  malakpet ps limits due to covid fear
'కరోనా భయంతో ఆత్మహత్య చేసుకున్న మహిళ'
author img

By

Published : Aug 28, 2020, 7:23 PM IST

హైదరాబాద్ మలక్​పేట పోలీస్​ స్టేషన్ పరిధిలోని శాలివాహన నగర్​లో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. తన ఇంట్లో అద్దెకు ఉంటున్న వారు కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలోనే తనకు కూడా వైరస్​ సోకుతుందన్న భయంతో.. విజయ(50) అనే మహిళ పురుగుల మందు తాగింది.

గమనించిన స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న మలక్​పేట్ పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు.

ఇవీ చూడండి: గణేష్ నిమజ్జనంలో రిటైర్డ్‌ ఆర్మీ జవాన్‌ కాల్పులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.