ETV Bharat / city

వేధింపులపై మానవ హక్కుల కమిషన్​కు ఫిర్యాదు..

తమతో కొందరు దురుసుగా ప్రవర్తిస్తున్నారని.. అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆరోపిస్తూ కొందరు మహిళలు మానవ హక్కుల కమిషన్​ను ఆశ్రయించారు. వారితో తమకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని వినతి పత్రం అందించారు.

hrc
వేధింపులపై మానవ హక్కుల కమిషన్​కు ఫిర్యాదు..
author img

By

Published : Aug 18, 2020, 4:27 PM IST

తమ అపార్టుమెంట్​లోని ఓ కుటుంబం తమతో అసభ్యకరంగా ప్రవర్తిస్తోందని.. దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ కొందరు మహిళలు రాష్ట్ర మానవహక్కుల కమిషన్​ను ఆశ్రయించారు. వారితో ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

మల్కాజిగిరి పరిధి యాప్రాల్​లో మోక్ష అపార్టుమెంట్​లో గత పదేళ్లుగా నివసిస్తున్నాం. బ్యాంకు ఉద్యోగులుగా, ఇంజినీర్లుగా, కొంత మంది విశ్రాంత ఉద్యోగులుగా జీవనం సాగిస్తున్నాం. ఇటీవల వెంకట్​రెడ్డి అనే వ్యక్తి తమ అపార్ట్​మెంట్​లో ఒక ఫ్లాట్​ కొనుగోలు చేశారు. అప్పటి నుంచి వెంకట్​రెడ్డితో పాటు సాఫ్ట్​వేర్ ఉద్యోగాలు చేస్తున్న అతని కుమారుల దౌర్జన్యాలు ఎక్కువయ్యాయి. తమ ఇళ్లలో సహాయకులుగా పనిచేసేందుకు వచ్చే వారినీ వేధిస్తున్నారు. ఈ విషయంలో పోలీసులను ఆశ్రయించినా.. న్యాయం జరగలేదు. వెంకట్​రెడ్డి, అతని కుమారులతో ప్రాణహాని ఉంది. తక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకోవడం సహా హెచ్​ఆర్​సీ తమకు న్యాయం చేయాలి.

---- బాధిత మహిళలు

ఇదీచూడండి: ఒక్కొక్కటి వెలుగులోకి కీసర తహసీల్దార్​ అక్రమాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.