ETV Bharat / city

Women Discrimination : 'ఆమె' ఆలోచనలోనూ మార్పు రావాలి - తెలంగాణలో మహిళా వివక్ష

Women Discrimination : ఆకాశంలో సగం అవకాశంలో సగం అనుకోవడమే తప్ప మహిళలు మాత్రం పురుషులతో సమానత్వంలో మాత్రమే వెనకబడే ఉంటోంది. ఇది మారాలి.. మహిళలకు పురుషులతో సమాన హక్కులు కలగాలి. ఆడవాళ్లను అందరూ గౌరవించాలి. అమ్మాయిలకు రక్షణ ఉండాలి.. మహిళా సాధికారత సాకారమవ్వాలి అంటే కేవలం పురుషుల వైఖరి మారితేనే సరిపోదు.. మహిళల ఆలోచనల్లోనూ మార్పు రావాలి. భర్త మాటే వినాలి.. పిల్లల బాధ్యత మాదే.. అని తమకు తామే గిరిగీసుకునే తత్వంలో మార్పు రావాలి.

Women Discrimination
Women Discrimination
author img

By

Published : Mar 8, 2022, 12:10 PM IST

Women Discrimination : స్వాతంత్య్ర అమృతోత్సవాలు చేసుకుంటోన్న భారతావని విద్య, వైద్యం, ఐటీ, అంతరిక్షం.. ఇలా ప్రతి రంగంలోనూ గణనీయ పురోగతి సాధించింది. కానీ స్త్రీ, పురుష సమానత్వంలో మాత్రం వెనకబడే ఉందంటోంది అమెరికా సంస్థ ‘ప్యూ థింక్‌ ట్యాంక్‌’ సర్వే. మన దేశంలో 30 వేల మంది పాల్గొన్న ఆ సర్వే వివరాల్ని తాజాగా విడుదల చేశారు. అందులో వెల్లడైన విషయాలను చూస్తే మహిళల ఆలోచనల్లో మార్పు రావాల్సిన అవసరం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది..

భర్త మాట వినాలి..

Women's Day 2022 : సగటు భారతీయ కుటుంబాల్లో.. స్త్రీ, పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరూ చెప్పే విషయం ఏంటంటే... ‘మహిళలు భర్త మాట వినాలి’. 89 శాతం పురుషులు, 86 శాతం మహిళలు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘పిల్లల బాధ్యత ప్రధానంగా మహిళలదే’ అన్న అంశానికి 24 శాతం మహిళలు, 35 శాతం పురుషులూ ఔనన్నారు.

ఉద్యోగం పురుష లక్షణమే..

Women's Day 2022 Story : ఉద్యోగాల కొరత ఉన్నపుడు మహిళలకంటే పురుషులకే అవకాశాలు ఇవ్వాలని మగవాళ్లతోపాటు ఆడవాళ్లూ అభిప్రాయపడ్డారు. సర్వేలో పాల్గొన్న వారిలో 82 శాతం పురుషులు, 77 శాతం మహిళలు ఈ మాటలు చెప్పారు.

భద్రత బాధ్యత అతడిదే..

Women's Day Significance : మహిళల భద్రత వాళ్ల ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుందనీ, ఈ విషయంలో వాళ్లకి సరైన మార్గనిర్దేశం అవసరమని ప్రతి నలుగురిలో ఒకరు అభిప్రాయపడ్డారు. దాదాపు సగం మంది మాత్రం అమ్మాయిల్ని గౌరవించడం గురించి అబ్బాయిలకే చెప్పాలన్నారు.

లింగ వివక్ష అక్కడ ఎక్కువ..

దేశంలో మహిళల విషయంలో వివక్ష ఉందని 23 శాతం అంగీకరించారు. తెలంగాణాలో ఇది 44 శాతం కాగా తమిళనాడులో 39 శాతం. అభిప్రాయం చెప్పిన మహిళల్ని మాత్రమే తీసుకుంటే జమ్మూ కశ్మీర్‌ (35 శాతం), అసోం(32 శాతం)లలో ఎక్కువ మంది తాము వివక్షకు గురవుతున్నట్టు చెప్పారు.

మగవాళ్లకి తీసిపోరు

రాజకీయాల్లో లింగ సమానత్వం కనుచూపుమేరల్లో లేనట్టు ఈ సర్వే చెబుతోంది. ఓటర్లలో సగం మంది మహిళలే అయినా 2019 లోక్‌సభకు ఎన్నికైన సభ్యుల్లో మహిళలు 14 శాతమే. స్త్రీలు.. మగవాళ్లకు ఏమాత్రం తగ్గకుండా రాజకీయాల్లో రాణిస్తారని 55 శాతం మంది అభిప్రాయపడగా.. మహిళలే ఎక్కువ సమర్థులని 14 శాతం చెప్పడం విశేషం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.