ETV Bharat / city

పురుషుడిగా మారాలనుకుంటున్న మహిళా కానిస్టేబుల్​కు ప్రభుత్వం అనుమతి!

sex change female to male: పురుషుడిగా మారాలనుకుంటున్న ఓ మహిళా కానిస్టేబుల్​కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. మధ్యప్రదేశ్​లో జరిగింది ఈ ఘటన. ఆ మహిళ ఎందుకు లింగమార్పిడి చేసుకోవాలనుకుంది? ప్రభుత్వం అనుమతించేందుకు గల కారణాలేంటి?

constable sex change
constable sex change
author img

By

Published : Dec 1, 2021, 7:33 PM IST

sex change female to male: పోలీసు శాఖలో పురుషులతో పోలిస్తే మహిళలకు కొన్ని వెసులుబాట్లు ఉంటాయి. కానీ, ఓ మహిళా కానిస్టేబుల్.. పురుషుడిగా మారాలనుకుంది. అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకుంది. అన్ని అంశాలు పరిశీలించిన ప్రభుత్వం తాజాగా లింగ మార్పిడికి అనుమతించింది.

పురుషుడిగా మారాలనుకుంటున్న మహిళా కానిస్టేబుల్​కు రాష్ట్ర హోంశాఖ నుంచి అనుమతులు వచ్చినట్లు అదనపు చీఫ్​ సెక్రటరీ(హోంశాఖ) డాక్టర్​ రాజేశ్​ రాజోరా తెలిపారు.

" మహిళ నుంచి పురుషుడిగా మారేందుకు ప్రభుత్వ విభాగం అనుమతించటం రాష్ట్రంలో ఇదే తొలిసారి. తన చిన్నతనం నుంచే ఆమె పురుష లక్షణాలను కలిగి ఉన్నట్లు సైకాలజిస్టులు తేల్చారు. ఈ కారణంతో ఆమెను లింగ మార్పిడి చేసుకునేందుకు హోంశాఖ అనుమతులిచ్చింది."

- డాక్టర్​ రాజేశ్​ రాజోరా, అదనపు చీఫ్​ సెక్రటరీ(హోంశాఖ).

లింగ మార్పిడికి అనుతించాలని ఆ మహిళా కానిస్టేబుల్​ 2019లో పోలీస్​ హెడ్​క్వార్టర్స్​కు దరఖాస్తు పంపించిందని, దాంతో పాటు అఫిడవిట్​ దాఖలు చేసినట్లు చెప్పారు రాజేశ్​ రాజోరా. ఆ దరఖాస్తును రాష్ట్ర హోంశాఖకు పోలీసు హెడ్​క్వార్టర్​ పంపించినట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం భారత పౌరులు తమ కులం, మతానికి సంబంధం లేకుండా తమ సెక్స్​ను ఎంపిక చేసుకోవచ్చన్నారు. అందుకు లోబడే లింగ మార్పిడికి అనుమతులు ఇచ్చినట్లు చెప్పారు.

ఇదీ చూడండి: constable rape attempt: కూకట్​పల్లిలో దారుణం.. బాలికపై కానిస్టేబుల్‌ అత్యాచారయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.