ETV Bharat / city

'తెరాస.. ఆవు లాంటి కాంగ్రెస్​ను చంపి.. పులి లాంటి భాజపాను బలోపేతం చేస్తోంది' - ASSEMBLY

"కుంతియా, ఉత్తమ్ ఉంటే కాంగ్రెస్ బాగుపడదు... తెరాస.. ఆవు లాంటి కాంగ్రెస్​ను చంపి.. పులి లాంటి భాజపాను బలోపేతం చేస్తోంది... నేను పార్టీ మారితే పదవులకు రాజీనామా చేశాకే వెళ్తా" - మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

పార్టీ మారితే పదవులకు రాజీనామా చేస్తా: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
author img

By

Published : Sep 18, 2019, 1:40 PM IST

తాను సాంకేతికంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నట్లు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెరాసలో విలీనమయ్యాక కాంగ్రెస్‌ నాయకత్వంపై నమ్మకం పోయిందని వ్యాఖ్యానించారు. కుంతియా, ఉత్తమ్ ఉంటే కాంగ్రెస్ బాగుపడదని ఎప్పటి నుంచో చెబుతున్నట్లు పేర్కొన్నారు. తెరాస... సాధుజంతువు ఆవు లాంటి కాంగ్రెస్​ను చంపి... పులి లాంటి భాజపాను బలోపేతం చేస్తోందని చమత్కరించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో లేదని... తెరాసకు భాజపా మాత్రమే ప్రత్యామ్నాయమని రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. తాను పార్టీ మారితే పదవులకు రాజీనామా చేసి వెళ్తానని ఉద్ఘాటించారు. తనకు, హరీష్ రావుకు 1990 నుంచి పరిచయం ఉందని... డిండి, ఉదయసముద్రం భూసేకరణకు ప్రభుత్వం డబ్బులు విడుదల చేయడం లేదని తక్షణమే విడుదల చేయాలని మంత్రిని కోరారు.

ఇవీ చూడండి: "త్వరలో విజయ డెయిరీ విస్తరణ"

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.