ETV Bharat / city

భర్త హత్యకు ప్రణాళిక.. కోడిపుంజుపై సైనేడ్​ ప్రయోగం

అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో భర్తను అంతమొందించాలని అనుకుంది భార్య. కుమారుడితో పాటు మరో ముగ్గురి సాయాన్ని తీసుకుని వ్యూహం రచించింది. ఆహారంలో సైనేడ్​ పెట్టి చంపాలని నిర్ణయించారు. ముందుగా ఆ సైనేడ్​ను కోడిపుంజుపై ప్రయోగించారు. అనంతరం సైనేడ్​ను మటన్​ కర్రీలో కలిపి భర్తకు తినిపించాలని చూశారు. రుచి వేరుగా ఉండడం వల్ల కూర వదిలేసిన భర్త వారి కుట్ర నుంచి తప్పించుకున్నాడు. క్రైమ్ థ్రిల్లర్​ సినిమాకు ఏ మాత్రం తీసిపోని ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమగోదావరి జిల్లా భీమడోలులో చోటుచేసుకుంది.

wife try to kill husbands with cyanide
wife try to kill husbands with cyanide
author img

By

Published : Feb 20, 2020, 9:12 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని​ పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం పోలసానిపల్లి గ్రామానికి చెందిన గోవింద్ గురునాథ్ అనే వ్యక్తి పాల వ్యాపారం చేస్తుంటాడు. అతని భార్య రాణి కిళ్లీ కొట్టు నిర్వహిస్తోంది. వీరికి వివాహం జరిగి సుమారు 19 సంవత్సరాలు అయింది. భర్త గురునాథ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో భార్య రాణి, కుమారుడు అతనితో కొంతకాలంగా గొడవలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో భార్య, కుమారుడు కలిసి గురునాథ్​ను చంపాలని భావించారు. దీనికి అదే గ్రామానికి చెందిన ఎ.ధనలక్ష్మి ఆమె భర్త శ్రీనివాసరావుల సాయం కోరారు. ఆహారంలో సైనేడ్​ కలిపి చంపితే ఎవరికీ అనుమానం రాదని వారు ప్రణాళిక రచించారు. ద్వారకా తిరుమల మండలం జాజులకుంటకు చెందిన వెంపా మోజేస్ సహకారంతో లిక్విడ్ సైనేడ్ తెప్పించుకున్నారు.

కోడిపుంజుపై ప్రయోగం

ముందుగా సైనేడ్​ పనిచేస్తుందో లేదో అని దానిని తమ ఇంట్లోని కోడిపుంజుపై ప్రయోగించారు. వారు పెట్టిన ఆహారం తిని కోడిపుంజు రంగు మారి చనిపోయింది. కోడిపుంజు ఎందుకు చనిపోయిందని భర్త ప్రశ్నించగా.... వైరస్ సోకిందని నమ్మించారు. అనంతరం పక్కా వ్యూహంతో గత ఆదివారం మటన్ కూరలో సైనేడ్ కలిపి గురునాథ్​కు పెట్టారు. మొదటి ముద్ద తిన్న గురునాథ్.... రుచి వేరుగా, పుల్లగా ఉండటంతో అనుమానం వచ్చి కూరను వదిలేశాడు.

భర్త నిద్రపోతున్నాడనుకుని..

సోమవారం ఉదయం గురునాథ్​ నిద్రపోతున్నాడనుకుని ఇంట్లోనే భార్య రాణి, ధనలక్ష్మి, శ్రీనివాస్ సైనేడ్ ప్రణాళిక గురించి చర్చించుకున్నారు. భార్య పన్నాగాన్ని తెలుసుకున్న గురునాథ్ ఆ రోజు సాయంత్రం భీమడోలు పోలీస్ స్టేషన్​కు వెళ్లి జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు అతని ఇంటిలోని మటన్ కర్రీ, సైనేడ్ బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఐదుగురుని అరెస్టు చేశారు. తనను చంపేందుకు కుట్ర పన్నిన వారిని కఠినంగా శిక్షించాలని గురునాథ్ కోరుతున్నాడు.

భర్త హత్యకు ప్రణాళిక.. కోడిపుంజుపై సైనేడ్​ ప్రయోగం

ఇదీ చదవండి:

నిర్భయ: ఉరి పడుతుందని.. తల పగలగొట్టుకున్నాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.