ETV Bharat / city

Ride Cancel : వాళ్లదో సమస్య.. వీళ్లదో సమస్య.. ఇలా అయితే ఎలా..! - హైదరాబాద్​లో ఉబర్​ ఓలా ఆటోలు

Auto Ride Cancel : అత్యవసరంగా క్యాబ్​లు, ఆటోల్లో వెళ్లాలనుకుంటున్నారా...? మీరు వెళ్లే చోటు డ్రైవర్​కు నచ్చకుంటే...ఆ రైడ్​ను రద్దు చేస్తారు. ప్రయాణీకులు కోరిన ప్రాంతం నుంచే తీసుకెళ్లి గమ్యస్థానానికి చేర్చేలా తీసుకొచ్చిందే ఓలా, ఊబర్ సర్వీసులు. కానీ వాహన డ్రైవర్​లు తమకు నచ్చని రైడ్​ను రద్దు చేసుకోవడంతో ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారు. పలు రైడ్​లు రద్దు చేసుకోడానకి గల కారణాలపై డ్రైవర్లను ఆరాతీస్తే పలు రకాల కారణాలు చెబుతున్నారు. అవేమిటంటే..

Ride Cancel
Ride Cancel
author img

By

Published : Feb 23, 2022, 10:41 PM IST

Auto Ride Cancel : గ్రేటర్ పరిధిలో ఎక్కడకికి వెళ్లాలన్నా.... వద్దు ఏ చింత.. ఓలా, ఊబర్ ఉందిగా మీచెంత.. అంటూ తీసుకొచ్చిన సర్వీసులు ప్రయాణీకులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఆటోడ్రైవర్ల పనితీరు ఆయా సంస్థల సర్వీసుపై ప్రభావం చూపుతోంది. పలు సమయాల్లో రైడ్​ను డ్రైవర్లు రద్దు చేసుకోవడం వల్ల ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5లక్షల వరకు ఆటోలు ఉన్నాయి. కేవలం గ్రేటర్ పరిధిలోనే సుమారు 2,25,000 లక్షల ఆటోలు నిత్యం ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 35,000 ఆటోలు ఓలా, ఉబర్‌ వంటి సంస్థల ద్వారా బుకింగ్‌లు స్వీకరిస్తున్నాయి. ఒక్కో ఆటో సగటున రోజుకు 10-12 రైడ్లు తీసుకుంటాయి. మొత్తం ఆటోలన్నీ కలిపి రోజుకి సుమారు 3.5 లక్షలకు పైగా రైడ్లు స్వీకరిస్తున్నాయి. క్యాబ్​ ధరతో పోలిస్తే ఆటో రేటు తక్కువ కావడం వల్ల ఎక్కువ మంది ఆటోలకే ఓటు వేస్తున్నారు.

ఇటీవలికాలంలో ఆటోవాలాలు రైడ్​లు రద్దు చేసుకుంటున్నట్లు ప్రయాణీకుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. దీనికి డ్రైవర్లు కూడా అవుననే చెబుతున్నారు. రోజుకు సుమారు అయిదు రైడ్​లను రద్దు చేసుకుంటున్నట్లు డ్రైవర్లు పేర్కొంటున్నారు. అవి తమకు నచ్చని ప్రదేశాలు...లేదంటే బుక్ చేసుకున్న ప్రదేశంలో ఆటో లేకపోవడంతో రద్దు చేసుకుంటున్నామంటున్నారు.

'రోజుకు 20 ట్రిప్పులు తీసుకుంటా. అందులో 5 క్యాన్సిల్​ కొడతా. దూరం ఎక్కువ ఉన్నవాటిని తిరస్కరిస్తాను. దగ్గరగా ఉన్నవాటినే ఎక్కువగా స్వీకరిస్తా.. రోజుకు రూ.2వేల వరకు వస్తుంది. వాటిలో రూ.500ఖర్చు పోను.. రూ.1,500 మిగులుతుంది. బుక్​ చేసుకున్నవాళ్ల పరిస్థితి అంటే.. కొన్ని సార్లు వాళ్లు కూడా రిస్క్​ భరిస్తారు కదా..' -జగన్​, ఆటో డ్రైవర్​

సాధారణంగా ఏదొక ప్రాంతం నుంచి ఓ ప్రయాణికుడు రైడ్ బుక్ చేసుకుంటే... ఆటోవాల ఉన్న దగ్గర నుంచి ఆ రైడ్ దగ్గరకు వెళ్లేందుకు సుమారు ఒకటి నుంచి రెండు కిలోమీటర్ల వరకు ఉంటుంది. కానీ రైడ్ బుక్ చేసుకున్న ప్రాంతం నుంచే రైడ్ ఛార్జీలు చెల్లిస్తారని. అందువల్ల తాము రెండు కిలోమీటర్లు నష్టపోవాల్సి వస్తుందని...అలాంటి సమయంలో ఎక్కువగా రైడ్​లు రద్దు చేసుకుంటున్నట్లు ఆటో డ్రైవర్లు అంటున్నారు. కొందరు ఎక్కడో ఉండి బుక్ చేస్తారు...వెళ్లే వారు మరొకరు. అలాంటప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయని మరికొందరు డ్రైవర్లు అంటున్నారు.

'రోజులో సుమారు 5నుంచి 6బుకింగ్​లు తీసుకుంటాను. వాటిలో 4వరకు క్యాన్సిల్​ చేస్తా. ఎందుకంటే కొంత మంది లొకేషన్​కు వెళ్లినా స్పందించరు. తీరా లొకేషన్​కు వెళ్లిన తర్వాత కొందరు రైడ్​ను రద్దు చేసుకుంటారు. అక్కడి వరకు వెళ్లిన దూరం వృథా అవుతుంది. కొన్ని సమయాల్లో ట్రాఫిక్​ సమస్యల వల్ల కూడా సమయానికి వెళ్లలేని పరిస్థితిలో రైడ్​ను రద్దు చేసుకోవాల్సి వస్తుంది.' -శ్రీనివాస్​, ఆటో డ్రైవర్​

'కొందరు ప్రయాణీకులు భారీ సామగ్రి తీసుకొస్తారు. వాటన్నింటినీ తీసుకెళ్లడం సాధ్యం కాదని చెబుతే క్యాన్సిల్​ చేసుకోమని చెబుతుంటారు. ఎక్కడో ఉన్న వ్యక్తులు వారికి సంబంధించిన వ్యక్తుల కోసం ఇక్కడ బుక్​ చేస్తారు. తీరా లొకేషన్​కు వెళ్తే వారు కనిపించక ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొందరైతే పిల్లలు పొరపాటున బుక్​ చేశారని చెబుతుంటారు. కొందరైతే సిలిండర్లు, ఇతర సామగ్రి తీసుకొస్తుంటారు. వాటిని ఎలా తీసుకెళ్లడం. ఈ సందర్భాల్లోనే ఎక్కువగా రైడ్​లు రద్దు చేసుకోవాల్సి వస్తోంది.' -రమేశ్​, ఆటో డ్రైవర్​

ఏది ఏమైనా... తాము ఆటోలు నడిపేది పొట్టకూటి కోసమే తప్ప... మరింకేం కాదంటున్నారు ఆటో డ్రైవర్లు. అనివార్య కారణాలతోనే రైడ్​లను రద్దు చేసుకుంటున్నామని చెబుతున్నారు. మరోవైపు అత్యవసర పరిస్థితిలో రైడ్​ రద్దవడం వల్ల ఇబ్బంది పడాల్సి వస్తోందని ప్రయాణీకులు అంటున్నారు. ఈ సమస్యపై ఆయా సంస్థలు స్పందించాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి : వైతెపాకు ఈసీ గుర్తింపు...​ సంబరాల్లో పార్టీ శ్రేణులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.