ETV Bharat / city

ఆ నలుగురిలో కమల దళపతి ఎవరో..?

తెలంగాణ భాజపా నూతన సారథి ఎంపిక ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. అర డజనుకుపైగా నేతలు పదవిని ఆశిస్తున్నా.. ప్రధానంగా నలుగురు నేతల మధ్యే పోటీ నెలకొంది. ఆశావహులు దిల్లీకి వెళ్లి జాతీయనేతల్ని కలిసి వచ్చారు. మొత్తమ్మీద డిసెంబరు మూడోవారానికల్లా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరన్నది తేలిపోనుంది.

telangana state bjp president
కమలదళపతి ఎవరో..
author img

By

Published : Dec 2, 2019, 9:55 AM IST

రాష్ట్రంలో కమలదళపతి ఎవరన్నది ఆసక్తిగా మారింది. భాజపా రాష్ట్రబాధ్యుడు కృష్ణదాస్‌ జరిపిన తొలివిడత అభిప్రాయ సేకరణలో రాష్ట్రనేతలు ఎక్కువ మంది ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్‌ వైపు మొగ్గు చూపారు. రెండో దఫాలో మాత్రం నాయకత్వ మార్పు జరగాలని కొందరు సూచించినట్లు తెలిసింది. ఇటీవల దిల్లీకి వెళ్లిన లక్ష్మణ్‌.. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, కార్యనిర్వాహక అధ్యక్షుడు నడ్డాలను కలిసి వచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడిగా తన మూడేళ్ల పనితీరుతోపాటు.. సికింద్రాబాద్‌ లోక్‌సభ టికెట్‌ దక్కని విషయాన్ని నడ్డాకు వివరించినట్లు తెలిసింది. సామాజికవర్గం, సీనియారిటీ వంటి అంశాలూ కలిసివస్తాయని.. పగ్గాలు తనకే దక్కుతాయని లక్ష్మణ్‌ ధీమాతో ఉన్నారు.

డీకే అరుణ.. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. జితేందర్‌రెడ్డి ఇప్పటికే అమిత్‌షా, నడ్డాలను కలిసి తన బయోడేటాను అందించారు. బలమైన సామాజికవర్గం, కొంతకాలం మినహా భాజపాతో సుదీర్ఘ అనుబంధం తదితర అంశాలను ఆయన జాతీయ నాయకత్వానికి వివరించినట్లు తెలిసింది. జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు పేరును సైతం కేంద్ర నాయకత్వం పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. లక్ష్మణ్‌, మురళీధర్‌రావు, డీకే అరుణ, జితేందర్‌రెడ్డిలలో ఎవరికి తెలంగాణ కమలదళం పగ్గాలు దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

ఆశావహులు ఎక్కువే..

ఈ నలుగురితోపాటు పదవి ఆశిస్తున్నవారి జాబితా పెద్దగానే ఉంది. కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ వైపు ఆరెస్సెస్‌ మొగ్గు చూపుతోంది. ఎమ్మెల్సీ రామచందర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ పేర్లూ వినిపిస్తున్నాయి. రఘునందన్‌రావు, కృష్ణసాగర్‌రావు వంటి నేతలు తమకూ అవకాశం ఇవ్వాలని కోరారు. తెలంగాణలో బీసీ ఓటర్ల మద్దతు పెంచుకునేందుకు భాజపా ప్రయత్నిస్తోంది. మరోవైపు ఇతర పార్టీల నుంచి ఓ బలమైన సామాజికవర్గం వారిని చేర్చుకోవడానికి ప్రాధాన్యమిస్తోంది. ఈ నేపథ్యంలో నిర్ణయం ఎలా ఉంటుందన్నది తేలాల్సి ఉంది.

పాతవారికే పగ్గాలు..?

పార్టీలో కొత్తగా చేరినవారికి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం లేదంటూ.. జాతీయ స్థాయిలో కీలక నేత నుంచి సంకేతాలు అందినట్లు తెలంగాణ భాజపా సీనియర్‌ నేత ఒకరు తాజాగా తన సన్నిహితులతో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. తొలినుంచి ఉండటం, పార్టీ బలోపేతానికి కృషిచేసేవారికే పగ్గాలు దక్కుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇవీచూడండి: ఆర్టీసీకి నేనే బ్రాండ్ అంబాసిడర్‌ను: కేసీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.