ETV Bharat / city

తడిసిన ధాన్యాన్ని ఏం చేద్దాం?.. అధికారుల మల్లగుల్లాలు.. - తడిసిన ధాన్యాన్ని ఏం చేద్దాం

Stained Grain: రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు అన్నదాతలకు ఆవేదన కలిగిస్తున్నాయి. నోటి కాడికి వచ్చిన కూడు నీటి పాలు చేస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, దానికి తోడు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు వారికి కన్నీటిని మిగులుస్తున్నాయి. జోరు వానలకు ధాన్యం నిల్వలు తడిసి ముద్దవుతున్నాయి. ఈ క్రమంలో తడిసిన ధాన్యాన్ని ఏమి చేయాలన్నది ప్రభుత్వానికి సవాల్‌గా మారింది.

Stained Grain
Stained Grain
author img

By

Published : Jul 10, 2022, 7:09 AM IST

Stained Grain News: జోరువానలకు ధాన్యం నిల్వలు తడుస్తున్నాయి. తడిసిన ఆ ధాన్యాన్ని సాధారణ బియ్యంగా మార్చటానికి అవకాశాలు తక్కువ. వాటిని మామూలు బియ్యంగా మార్చినా ప్రమాణాల మేరకు ఉండవని, ఎఫ్‌సీఐ తీసుకునే పరిస్థితి లేదని అధికారులే అంగీకరిస్తున్నారు. ఉప్పుడు బియ్యంగా మారుద్దామన్నా రాష్ట్రంలో వినియోగం లేదు. ఈ క్రమంలో తడిసిన ధాన్యాన్ని ఏమి చేయాలన్నది ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. ఆరుబయట ఉంచినవి సుమారు 20లక్షల టన్నుల వరకు ఉండగా.. అందులో 50 శాతానికిపైగా తడిసినట్లు మిల్లర్లు చెబుతున్నారు. వర్షాలు పడేకొద్దీ ధాన్యం మరింతగా తడుస్తుంది. దాన్ని వేలం వేస్తే కొని, ఉప్పుడు బియ్యంగా మార్చి ఎగుమతులు చేస్తామని రాష్ట్ర రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ ప్రభుత్వాన్ని కోరింది.

రంగు మారతాయి... తడిసిన ధాన్యాన్ని మరపడితే బియ్యం రంగు మారుతుంది. ఆ బియ్యాన్ని రేషన్‌కార్డుదారులకు ఇచ్చే పరిస్థితి ఉండదు. సాధారణ బియ్యంగా మారిస్తే కోళ్లదాణా కోసం వినియోగించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తడిసిన ధాన్యంలో కనీసం పది లక్షల మెట్రిక్‌ టన్నులను వేలం వేయటమే మార్గంగా కనిపిస్తోందని ఓ అధికారి చెప్పారు.

పునరుద్ధరిస్తే ఊరటే... బియ్యం సేకరణను కేంద్రం పునరుద్ధరిస్తే ప్రభుత్వానికి, మిల్లర్లకు ఊరటే. ఇప్పటికే మిల్లుల్లో 94 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం నిల్వలున్నాయి. వాటి నుంచి 63లక్షల మె.ట. మేర బియ్యం వస్తాయి. కేంద్రం సానుకూల స్పందన నేపథ్యంలో సేకరణ పునరుద్ధరణకు సోమవారం ఉత్తర్వులు రావచ్చన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రస్తుత యాసంగి సంగతి ఎలా ఉన్నా 2020-21 వానాకాలం సీజన్‌కు సంబంధించి 70 లక్షల మె.ట. ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. దాని నుంచి 20 లక్షల మె.ట. బియ్యాన్ని మిల్లర్లు ఇప్పటికే ఎఫ్‌సీఐ, పౌరసరఫరాల సంస్థలకు ఇచ్చారు. మరో 44 లక్షల మె.ట. వరకు ధాన్యం మిగిలింది. కేంద్రానికి ఇవ్వాల్సింది పోను కొద్దోగొప్పో మిగిలినా దాన్ని రాష్ట్రంలోని రేషన్‌కార్డుదారులకు కావాల్సిన బియ్యం కోసం వినియోగించవచ్చు. ఇక మిగిలేది ఇటీవల ముగిసిన యాసంగి ధాన్యం ఒక్కటే. 50 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా ప్రభుత్వం కొనుగోలు చేసింది. దాన్ని సాధారణ బియ్యంగా మార్చాలి. అలా చేస్తే నూకలు ఎక్కువగా వస్తాయి. ప్రయోగాత్మక మిల్లింగ్‌ నివేదిక అధికారికంగా అందాక నష్ట పరిహారం వ్యవహారం కొలిక్కి వస్తే ఆ చిక్కుముడీ వీడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.