ETV Bharat / city

కేంద్రమంత్రి గారు.. మోదీ సర్కార్ చేసిన అప్పుల సంగతేంటి..? - తెలంగాణ వార్తలు

KTR today Tweet: ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్ మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. తెలంగాణ అప్పులపై మాట్లాడుతున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్.. కేంద్రం అప్పులపై కూడా స్పందించాలని ట్విటర్ వేదికగా డిమాండ్ చేశారు. మోదీ పుణ్యమా ఇప్పుడు ప్రతీ భారతీయుడిపై లక్షా 25వేల అప్పు ఉందని ట్వీట్ చేశారు.

KTR today Tweet
KTR today Tweet
author img

By

Published : Sep 4, 2022, 5:56 PM IST

KTR today Tweet: తెలంగాణ రాష్ట్ర అప్పులపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్విటర్​లో ఘాటుగా స్పందించారు. 2014 ముందు వరకు 67 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో 14 మంత్రి ప్రధానులు మారినా దేశ అప్పు 56 లక్షల కోట్లు ఉండేదన్నారు. మోదీ పీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత గత ఎనిమిదేళ్లలో 100 లక్షల కోట్లకు అప్పు పెరిగిందని విమర్శించారు. ఫలితంగా ప్రతి భారతీయుడిపై 1.25 లక్షల అప్పు ఉందని పేర్కొన్నారు.

ఆర్థిక వివేకం గురించి అనర్గళంగా మాట్లాడుతున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ .. ఆయా అంశాలను సైతం ప్రస్తావించాలన్నారు. 2022లో తెలంగాణ తలసరి ఆదాయం 2.78 లక్షలు కాగా... జాతీయ తలసరి ఆదాయం కేవలం 1.49 లక్షలే అని ట్విటర్​లో పేర్కొన్నారు. ఇక తెలంగాణ జీఎస్​డీపీ కేవలం 23.5 శాతం అని వివరించారు. భారత్​లో కేవలం 2.5 శాతం జనాభా కలిగిన తెలంగాణ జీడీపీలో ఐదు శాతం వాటం కలిగి ఉందని.. భాజపా పాలిత ప్రాంతాలు తెలంగాణ ప్రభుత్వం అంత మెరుగ్గా పనిచేస్తే భారత్ 4.6 ట్రిలియన్ డాలర్ల ఎకానమికి ఎదిగేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

  • Madam FM waxes eloquent on Fiscal prudence;

    Till 2014, in 67 years 14 Prime Ministers of India together have raised a debt of ₹ 56 Lakh Crores

    Then came PM Modi Ji; in the last 8 years alone India’s debt incremented by ₹ 100 Lakh Crores

    Every Indian has a debt of ₹1.25 Lakh

    — KTR (@KTRTRS) September 4, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.