తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా రామగుండంలో బుధవారం తెల్లవారుజామున సాధారణంకన్నా 7 డిగ్రీల మేరకు పెరిగి 22 డిగ్రీలకు చేరింది. హైదరాబాద్లో 5.6 డిగ్రీలు పెరిగి 20.9 డిగ్రీలకు చేరింది. నిజామాబాద్లో 5.4 డిగ్రీలు పెరిగి 19.9 డిరగ్రీలుగా నమోదైంది. ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరగడం ఈ నెలలో ఇదే తొలిసారి అని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు.
ఆగ్నేయ భారతం నుంచి తెలంగాణ వైపు వీస్తున్న తేమగాలులు కొనసాగుతున్నాయని వీటి కారణంగా ఆకాశంలో మేఘాలేర్పడి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని ఆయన చెప్పారు. బుధవారం పగలు హైదరాబాద్లో 29.9, రామగుండంలో 29.2 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇదీ చదవండిః చంద్రబాబును ఆయన నివాసానికి తరలించిన పోలీసులు