రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో పాటు వడగళ్ల వాన కురుస్తోంది. తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గాలిలో తేమ శాతం ఎక్కడ ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాల్లో క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, వాతవరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి: నగరంలో భారీ వర్షం... రోడ్లన్నీ జలమయం