ETV Bharat / city

WEATHER REPORT: అప్పటి దాకా భగభగలు.. అంతలోనే వానలు - తెలంగాణ వాతావరణ వివరాలు

అప్పటి వరకు భానుడి ప్రతాపం.. అంతలోనే మేఘాలు ఏర్పడి భారీ వర్షం కురువడం. రెండు,మూడు రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. రాగల మూడు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.

weather report
weather report
author img

By

Published : Aug 26, 2021, 4:05 PM IST

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం, శనివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అలాగే మూడు రోజులపాటు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతాయని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో వివరించారు. పశ్చిమ, వాయవ్య భారత ప్రాంతాల నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయి.

బుధవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 7 గంటల వరకూ 11 గంటల వ్యవధిలోనే పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా కోటగిరి(నిజామాబాద్‌ జిల్లా)లో 13.6 సెంటీమీటర్లు, పెద్దూరు(రాజన్న)లో 9, రామారెడ్డి(కామారెడ్డి)లో 8.2, అవునూరు(రాజన్న)లో 7.4, మర్రిపల్లిగూడెం(హనుమకొండ)లో 6.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

కొన్నిచోట్ల అప్పటికప్పుడు మేఘాలేర్పడి భారీ వర్షం పడుతోంది. వాతావరణశాఖ భారీ వర్షాలు కురుస్తాయని గత రెండు రోజులుగా ఎలాంటి సూచనలు ఇవ్వకపోవడం గమనార్హం. మరోవైపు వానలు లేని ప్రాంతాల్లో ఎండ వేడి పెరిగింది. బుధవారం అత్యధికంగా నాగులవంచ(ఖమ్మం జిల్లా)లో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

ఇవీ చూడండి: Viral Video: జైలులో ఖైదీల మందు పార్టీ.. వీడియో వైరల్!​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.